iDreamPost

చైతు సాయిపల్లవిల మేజిక్ పని చేస్తూనే ఉంది

చైతు సాయిపల్లవిల మేజిక్ పని చేస్తూనే ఉంది

నాగ చైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తీసిన సెన్సిబుల్ లవ్ స్టోరీ బ్రేక్ ఈవెన్ కి దగ్గరలో ఉంది. సుమారు 32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగిన ఈ సినిమాకు ఇప్పటిదాకా 28 కోట్లకు పైగానే షేర్ రావడం విశేషం. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఆల్ ఇండియాలో ఏ సినిమాతో పోల్చుకున్నా ఇదే హయ్యెస్ట్ కలెక్షన్. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ కూడా ఈ స్థాయిలో రాబట్టలేకపోయింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హాలీవుడ్ మూవీస్ సైతం దీనికి చాలా దూరంలో ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి లవ్ స్టోరీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా నిలవడం నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు బాగా కలిసి వస్తోంది. ఇన్ని ఫిగర్స్ నమోదు కావడానికి కారణం ఇదే.

ఇక నిన్న రిలీజైన సాయి తేజ్ రిపబ్లిక్ టాక్ కూడా లవ్ స్టోరీకి ప్లస్ గా మారుతోంది. ఇవాళ రేపు దీనికన్నా మెరుగ్గా లవ్ స్టోరీ బుకింగ్స్ ఉన్నా ఆశ్చర్యం లేదు. జేమ్స్ బాండ్ నో టైం టు డై ప్రభావం బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రంగానే ఉంది. ప్రమోషన్ విషయంలో వహించిన నిర్లక్షానికి ఇప్పుడు నిర్మాతలు మూల్యం చెల్లించబోతున్నారు. కొత్త బాండ్ సినిమా మేజిక్ అంతగా లేదని అర్థమవుతోంది. మిగిలిన చిన్నా చితకా చిత్రాలకు కూడా రెస్పాన్స్ సోసోగా ఉంది. సో లవ్ స్టోరీ ఈ అవకాశాన్ని వాడుకునేలా కనిపిస్తోంది. ఆన్ లైన్ కన్నా ఈ రెండు మూడు రోజులు కరెంట్ బుకింగ్స్ ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది.

నైజామ్ – 10 కోట్ల 57 లక్షలు
సీడెడ్ – 3 కోట్ల 55 లక్షలు
ఉత్తరాంధ్ర – 2 కోట్ల 47 లక్షలు
ఈస్ట్ గోదావరి – 1 కోటి 34 లక్షలు
వెస్ట్ గోదావరి – 1 కోటి 13 లక్షలు
గుంటూరు – 1 కోటి 30 లక్షలు
కృష్ణా – 1 కోటి 12 లక్షలు
నెల్లూరు – 71 లక్షలు

ఏపి/తెలంగాణ వారం రోజుల షేర్ – 22 కోట్ల 19 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 42 లక్షలు

ఓవర్సీస్ – 4 కోట్ల 50 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల షేర్ – 28 కోట్ల 11 లక్షలు

సో లాభాల్లోకి ప్రవేశించాలంటే ఇంకో 4 కోట్లు వస్తే లవ్ స్టోరీ పక్కా బ్లాక్ బస్టర్ అందుకున్నట్టే. ఇది అసాధ్యం కాదు కానీ మరీ ఈజీ అయితే కాదు. కాకపోతే రిపబ్లిక్ టాక్, కొండపొలం ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది కాకపోవడం లాంటి అంశాలు ప్లస్ గా మారొచ్చు. ఇప్పటికీ ఎక్కువ స్క్రీన్లలో కొనసాగుతున్న లవ్ స్టోరీ ఇవాళ రేపు ఎంతలేదన్నా కోటిన్నర పైగా ఈజీ రాబట్టుకునే ఛాన్స్ ఉంది. అదే జరిగితే టార్గెట్ ఇంకా సులభం అవుతుంది. ఈ సక్సెస్ ని చూసే మిగిలిన నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ డేట్లను ప్రకటిస్తున్నారు. దసరా నుంచి ఏపిలోనూ ఫుల్ ఆక్యుపెన్సీతో అనుమతులు రావొచ్చనే వార్తల నేపథ్యంలో బాక్సాఫీస్ కు మరింత జోష్ రానుంది

Also Read : మంచు విష్ణు మీద ప్రకాష్ రాజ్ ఫైర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి