మంచు విష్ణు మీద ప్రకాష్ రాజ్ ఫైర్

By iDream Post Oct. 02, 2021, 10:39 am IST
మంచు విష్ణు మీద ప్రకాష్ రాజ్ ఫైర్

ఇంకో ఎనిమిది రోజుల్లో టాలీవుడ్ మా అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే రెండు వర్గాలు ప్రచారాన్ని ఉదృతం చేయగా ఈసారి మీడియాని గట్టిగా వాడుకుంటున్నారు. న్యూస్ ఛానల్స్ డిబేట్లకు ఇంటర్వ్యూలకు వస్తూ విమర్శలను గట్టిగానే సంధిస్తున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మంచు విష్ణుని ఉద్దేశించి పవన్ మార్నింగ్ షో కలెక్షన్లంత ఉండదు నీ సినిమా బడ్జెట్ అంటూ నేరుగా కౌంటర్ వేయడంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఇండస్ట్రీ వేరు పవన్ చేసిన కామెంట్స్ వేరు నువ్వు ఎవరి పక్క అంటూ మొన్న మంచు విష్ణు నామినేషన్ టైంలో ప్రశ్నించడంతో ఈ విలక్షణ నటుడు భగ్గుమనాల్సి వచ్చింది.

ఇదొక్కటే కాదు నరేష్ మీద కూడా గట్టిగానే బాణాలు సంధించారు ప్రకాష్ రాజ్. తన స్థానికత గురించి, తెలుగువాళ్లకు చేతకాలేదు కాబట్టే నేనొచ్చానని చెప్పడం గురించి ఘాటుగా క్లాస్ తీసుకున్నారు. సిగ్గులేదంటూ నరేష్ ని ఉద్దేశించి ఎటాక్ చేశారు. అనని మాటలను అన్నట్టు ఇలా ప్రచారం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న మంచు విష్ణు సూపర్ స్టార్ కృష్ణ ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు దగ్గరుండి మరీ తీసుకెళ్లారు. ప్యానెల్ మెంబెర్స్ కూడా ఉన్నారు. ఇంకా ప్రకాష్ రాజ్ ఇలాంటి క్యాంపైన్ మొదలుపెట్టలేదు. ప్రస్తుతం ఇద్దరూ మేనిఫెస్టో విడుదల పనిలో బిజీగా ఉన్నారు.

మొత్తానికి సగటు ప్రేక్షకుడికి ఏ మాత్రం అక్కర్లేని మా ఎన్నికల వ్యవహారం ఇప్పుడో హాట్ టాపిక్ గా మారింది. గెలుపు మీద ఎవరి ధీమా వారిది సహజమే కానీ ఈసారి మరీ రాజకీయ నాయకుల రేంజ్ లో పోటీ పడుతున్నారు. బండ్ల గణేష్ విత్ డ్రా చేసుకుని నేరుగా ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇవ్వడం, ఓ ఛానల్ వేదికగా పేద సినీ కార్మికులకు ఉచితంగా 100 ఇళ్ళు కెసిఆర్ కాళ్ళు పట్టుకుని అయినా కట్టిస్తానని పదే పదే చెప్పడం వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. రాబోయే వారం రోజులు పరిణామాలు మరింత వేడిని రాజేయడం మాత్రం ఖాయం. మా ప్రెసిడెంట్ ఎవరవుతారో ఆ తర్వాత ఏం చేస్తారో కానీ ఇప్పుడు మాత్రం సినిమాను మించిన నాటకీయత నడుస్తోంది

Also Read : వెనక్కి తగ్గిన బండ్ల.. వారి కోరిక మేరకేనట!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp