iDreamPost

థాంక్ యు – కలెక్షన్లు మాత్రం సారీ

థాంక్ యు – కలెక్షన్లు మాత్రం సారీ

నిన్న విడుదలైన థాంక్ యుకి అన్ని వైపులా దెబ్బ పడుతోంది. ఒకపక్క టాక్ సోసోగా ఉంది. మరోపక్క నైజామ్ లో మళ్ళీ మొదలైన వర్షాలు జనాన్ని బయటికి రాకుండా చేస్తున్నాయి. రిలీజ్ కు ముందున్న వీక్ బజ్ కనీసం అభిమానులను థియేటర్ దాకా రానివ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేయడం కొంత ప్రయోజనం కలిగించింది కానీ ఫైనల్ గా చూసుకుంటే వసూళ్లు మాత్రం చాలా తీసికట్టుగా ఉన్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, పబ్లిసిటీ గట్రా ఎన్ని చేసినా జనం ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఆల్రెడీ చూసేసిన కథలను మళ్ళీ మళ్ళీ చూపిస్తే ఎలా ఒప్పుకుంటారు.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు థాంక్ యు మొదటి రోజు షేర్ 2 కోట్లు కూడా టచ్ కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. నైజామ్ లోనే 72 లక్షలు రావడం అంతో ఇంతో సేఫ్ చేసింది కానీ మిగిలిన ఏరియాలు మరీ అన్యాయంగా ఉన్నాయి. సీడెడ్ 20 లక్షలు, ఉత్తరాంధ్ర 22 లక్షలు, ఈస్ట్ గోదావరి 14 లక్షలు, వెస్ట్ గోదావరి 8 లక్షలు, గుంటూరు 10 లక్షలు, కృష్ణా 12 లక్షలు, నెల్లూరు 7 లక్షలు వెరసి ఏపి తెలంగాణ కలిపి 1 కోటి 65 లక్షలు వచ్చిందట. గ్రాస్ లెక్కలో చూసుకుంటే 2 కోట్ల 70 లక్షల దాకా ఉంటుంది. దిల్ రాజు బ్యానర్, టాలీవుడ్ లో ఉన్న మంచి క్యాస్టింగ్, తమన్ సంగీతం ఇలాంటి హంగులు ఎన్ని ఉన్నా ఈ ఫిగర్లు చోటు చేసుకోవడం విషాదం.

ఈ రోజు రేపు వీకెండ్ అయినప్పటికీ అద్భుతాలను ఆశించలేం. బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయనే అంచనాలు వాతావరణ శాఖ వేసింది కాబట్టి ఇప్పుడీ రెస్పాన్స్ తో థాంక్ యు అమాంతం కలెక్షన్లు పెంచుకునే ఛాన్స్ లేదు. కాకపోతే ఏ స్థాయి డిజాస్టర్ అవుతుందనేది ఒక వారం అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇదంతా అఫీషియల్ గా చెప్పకపోయినా ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం థాంక్ యుకి జరిగిన థియేట్రికల్ బిజినెస్ 23 కోట్ల దాకా ఉంది. బాగుందనే మాట వస్తే చైతు బ్రేక్ ఈవెన్ చేయడం ఈజీనే. కానీ కనీసం యావరేజ్ అనిపించుకున్నా కొంచెం బెటర్ గా ఉండేదేమో కానీ చూస్తుంటే గట్టెక్కడం కష్టమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి