iDreamPost

యూట్యూబర్ అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

యూట్యూబర్ అన్వేష్ ప్రేమ- పెళ్లి- విడాకులపై కీలక వ్యాఖ్యలు!

యూట్యూబ్ లో ‘నా అన్వేషణ’ ఛానల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నా పేరు అన్వేష్.. నేను ప్రపంచ యాత్రికుడిని అంటూ వచ్చే వీడియోలకు గంటల వ్యవధిలోనే లక్షల్లో వ్యూస్ వస్తూ ఉంటాయి. ప్రపంచంలోని వింతలు, విడ్డూరాలు, ప్రకృతి సౌందర్యాలను అన్వేష్ వీడియోలు రూపంలో ప్రేక్షకులకు చూపిస్తూ ఉంటాడు. మనం వెళ్లాలి అనుకున్న వెళ్లలేని ఎన్నో ప్రంతాలకు అన్వేష్ వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉండే సంప్రదాయాలు, సంస్కృతిని తెలియజేస్తూ ఉంటాడు. లక్షలు ఖర్చు పెట్టి ఈ వీడియోలు తీస్తూ ఉంటాడు.

ఇన్నాళ్లు అన్వేష్ కు సరైన ఆదాయం రాలేదు. కానీ, ఇప్పుడు తెలుగులోనే టాప్ యూట్యూబర్ గా నెలకు రూ.లక్షల్లో అందుకుంటున్నాడు. ఒకనెల రూ.30 లక్షలు వచ్చాయి అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. అంతా చాలా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నెల రూ.60 లక్షలు వచ్చాయన్నాడు. అయితే ఇది చూసి చాలా మంది యూట్యూబర్లు అవ్వాలి అనుకున్నారు. వారికి కూడా అసలు విషయం చెప్పి కళ్లు తెరిపించాడు. అయితే అన్వేష్ అన్నీ బాగానే చెప్తుంటాడు.. మంచి మంచి వీడియోలు తీస్తుంటాడు. రోజూ ఏదొక దేశంలో పర్యటిస్తూ ఉంటాడు. అయితే అసలు అతని వ్యక్తిగత జీవితం గురించి మాత్రం ఎప్పుడూ చెప్పడు. అసలు అతనికి పెళ్లైందా? భార్యా పిల్లలు ఉన్నారా? ఇలాంటి టాపిక్స్ ని తీసుకురాడు. కానీ, ఇంత స్వేచ్ఛ ఎలా తిరుగుతున్నాడు? పెళ్లి కాలేదా? అనే ప్రశ్నను ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఎప్పటినుంచో అడుగుతున్నారు.

ఎట్టకేలకు అన్వేష్ ఆ ప్రశ్నకు సమాధానం అయితే చెప్పాడు. తన వ్యక్తిగత జీవితాన్ని వివరిస్తూ నా ప్రేమ- పెళ్లి- విడాకులు అంటూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలు అసలు విషయాలను ప్రేక్షకులకు వెల్లడించాడు. అన్వేష్ కు అంత ఫ్యాన్ బేస్ రావడానికి ప్రధాన కారణం అతని మాటతీరు. అవును.. మనసులో ఏమున్నా అదే పైకి మాట్లాడతాడు. ఎప్పుడూ కూడా ప్రేక్షకులను మెప్పించాలని లేనిది ఉన్నదిగా చెప్పడు. ఇప్పుడు తన వ్యక్తిగత జీవితాన్ని చెబుతూ మరోసారి అదే నిరూపించుకున్నాడు. తనకు జరగాల్సిన పెళ్లి ఎలా తప్పిపోయిందో వివరించాడు. తనకు ఒక అమ్మాయితో నిశ్చితార్థం అయింది. అప్పట్లో అన్వేష్ అమెరకాలో ఉద్యోగం చేస్తుండోవాడు. అయితే కరోనా వచ్చిన తర్వాత అతడిని ఓడలో ఇంటికి పంపేశారు. కరోనాకి ముందు అతనికి అమెరికాలో ఉద్యోగం ఉందనే పెళ్లికి అంగీకరించారు.

అమెరికాలో ఉద్యోగం పోవడంతో పిల్ల తల్లిదండ్రులు అతడికి పిల్లను ఇచ్చేందుకు అంగీకరించలేదు. అక్కడితో అతని పెళ్లికి నిశ్చితార్థం దగ్గరే బ్రేకులు పడ్డాయి. తన జీవితంలో కరోనా చేసిన చెడు.. మంచి రెండింటిని అన్వేష్ యాక్సెప్ట్ చేశాడు. చెడు అంటే పెళ్లి చెడిపోవడం. మరి.. మంచి ఏంటి అంటారా? ఉద్యోగం పోవడం.. పెళ్లి ఆగిపోవడం వల్లే అన్వేష్ ఒక యూట్యూబర్ గా మారాడు. అదే ఉద్యోగం పోకపోతే చక్కగా అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాతే అసలు అతనంటే ఏంటో ఆలోచించడం ప్రారంభించాడు. తన గోల్ ఏంటో గుర్తించాడు. 2019 ఆగస్టు 20 నుంచి యూట్యూబర్ గా లక్షల మంది అభిమానాన్ని పొందాడు. 1.47 మిలియన్ సబ్ స్క్రైబర్స్ తో దూసుకుపోతున్నాడు. అయితే లైఫ్ ఏదీ ఎండ్ పాయిండ్ కాదు.. ప్రతి డెడ్ ఎండ్ ఇంకో కొత్త జర్నీకి స్టార్టింగ్ పాయింట్ అవుతుందని అన్వేష్ తన రియల్ లైఫ్ ద్వారా అందరికీ తెలిసే చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి