iDreamPost
android-app
ios-app

తన రోల్ మోడల్ ఎవరో చెప్పిన రన్ మెషిన్ కింగ్ కోహ్లీ! ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 08:16 AM, Thu - 31 August 23
  • Author Soma Sekhar Published - 08:16 AM, Thu - 31 August 23
తన రోల్ మోడల్ ఎవరో చెప్పిన రన్ మెషిన్ కింగ్ కోహ్లీ! ఎవరంటే?

ప్రతీ వ్యక్తికి జీవితంలో ఎవరో ఒకరు రోల్ మోడల్ ఉంటారు. వారి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని, జీవితంలో ముందుకు సాగుతూ ఉంటారు. ఇక రన్ మెషిన్ గా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కింగ్ విరాట్ కోహ్లీకి సైతం ఓ రోల్ మోడల్ ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు విరాట్. హోస్ట్ మీ రోల్ మోడల్ ఎవరు? అని ప్రశ్నించగా.. ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు కోహ్లీ.. దాంతో గ్యాలరీ మెుత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. మరి విరాట్ కోహ్లీ రోల్ మోడల్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

విరాట్ కోహ్లీ.. వరల్డ్ వైడ్ గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకుని, క్రికెట్ ను ఏలుతున్న రారాజు. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ.. ప్రపంచ క్రికెట్ పై కింగ్ గా తన పేరును లిఖించుకున్నాడు. దీంతో ఎంతో మందికి రోల్ మోడల్ గా మారాడు విరాట్ భాయ్. మరి అలాంటి విరాట్ కోహ్లీకి కూడా ఓ రోల్ మోడల్ ఉన్నాడంటే కూసింత ఆశ్చర్యమనే చెప్పాలి. అదికూడా క్రికెట్ కు సంబంధించిన వ్యక్తి విరాట్ రోల్ మోడల్ కావడం విశేషం.

తాజాగా జరిగిన ఈవెంట్ లో మీ రోల్ మోడల్ ఎవరు? అని హోస్ట్ ప్రశ్నించింది. దీనికి ఎవరూ ఊహించని సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ. నా జీవితానికి రోల్ మోడల్ నా భార్యే అని ఆన్సర్ ఇచ్చాడు విరాట్ భాయ్. దీంతో గ్యాలరీ మెుత్తం చప్పట్లతో మార్మోగిపోయింది. ఆమె నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను, తను ఎప్పుడూ సరైన నిర్ణయాలనే తీసుకుంటుంది. నేను ఈ విషయాన్ని జెన్యూన్ గా చెబుతున్నాను అని విరాట్ తెలిపాడు. తన గుండె దైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ తన భార్య అనుష్క శర్మను పొగడ్తలతో ముంచెత్తాడు. మరి విరాట్ కోహ్లీ తన భార్యే రోల్ మోడల్ అని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss