iDreamPost

ఆ కుర్రాడు కుంబ్లే, అశ్విన్‌ను మించిన బౌలర్‌: ముత్తయ్య మురళీధరన్

  • Author Soma Sekhar Published - 06:56 PM, Mon - 4 December 23

శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టీమిండియా బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ కుర్రాడు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ ను మించిన బౌలర్ అవుతాడని చెప్పుకొచ్చాడు.

శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టీమిండియా బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ కుర్రాడు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ ను మించిన బౌలర్ అవుతాడని చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 06:56 PM, Mon - 4 December 23
ఆ కుర్రాడు కుంబ్లే, అశ్విన్‌ను మించిన బౌలర్‌: ముత్తయ్య మురళీధరన్

స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది టీమిండియా. మెుత్తం యువ క్రికెటర్లతో నిండిన భారత టీమ్.. కంగారూ జట్టును మట్టికరిపించింది. ఈ సిరీస్ ను సాధించడం ద్వారా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఓటమికి కొంతలో కొంత రివేంజ్ తీర్చుకుంది. ఇక ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక లెజెండ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ ల తర్వాత మళ్లీ అలాంటి స్పిన్నర్ ఇండియాలో పుట్టాడు అంటూ కితాబిచ్చాడు లంక స్పిన్ లెజెండ్. మరి ఆ స్పిన్నర్ ఎవరు? ఇప్పుడు చూద్దాం.

కంగారూ టీమ్ ను కంగారు పెట్టించి 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఈ టోర్నీలో భారత నయా స్పిన్ సంచలనం రవి బిష్ణోయ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 5 మ్యాచ్ ల్లో 9 వికెట్లు సాధించి.. అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? ఈ ఐదు మ్యాచ్ ల్లో కూడా తొలి ఓవర్ లోనే టీమిండియాకు వికెట్ అందించాడు. ఈ క్రమంలోనే అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. బిష్ణోయ్ ను భారత దిగ్గజ స్పిన్నర్లు అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ లతో పోల్చాడు. వీళ్ల కంటే గొప్ప బౌలర్ అయ్యే లక్షణాలు అతడిలో పుష్కలంగా ఉన్నాయని కితాబిచ్చాడు ముత్తయ్య.

ఈ క్రమంలోనే భారత క్రికెట్ లో ప్రతీ తరానికి అద్భుతమైన స్పిన్నర్లు పుట్టుకొస్తున్నారని, కుంబ్లే, అశ్విన్ తర్వాత ఇప్పుడు రవి బిష్ణోయ్ ను చూస్తున్నాం అంటూ ప్రశంసలు కురిపించాడు. “రవి బిష్ణోయ్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్. మిగతా లెగ్ స్పిన్నర్ల కంటే అతడు చాలా భిన్నమైనవాడు. బంతిని వేగంగా సంధించడంతో పాటుగా.. టర్న్ చేయగల సత్తా ఉంది. అయితే మిగతా బౌలర్లలో అక్షర్ కూడా వేగంతో బాల్స్ వేయగలడు కానీ.. టర్న్ పెద్దగా ఉండదు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ సైతం అక్షర్ లాగే ఉంటుంది” అంటూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు లంక లెజెండరీ స్పిన్నర్. మరి ముత్తయ్య మురళీధరన్ రవి బిష్ణోయ్ ను వరల్డ్ క్లాస్ స్పిన్నర్ గా అభివర్ణించినపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి