iDreamPost
android-app
ios-app

Weekend Suggestion: ఈ వీకెండ్ OTT లోకి రాబోయే.. ఈ 4 సినిమాలను అసలు మిస్ కాకండి!

  • Published May 02, 2024 | 11:42 AM Updated Updated May 02, 2024 | 11:42 AM

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే చిత్రాలలో కొన్ని స్పెషల్ మూవీస్ కూడా ఉన్నాయి. ఏ సినిమా లైట్ తీసుకున్నా ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలను మాత్రం అసలు లైట్ తీసుకోకండి.

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే చిత్రాలలో కొన్ని స్పెషల్ మూవీస్ కూడా ఉన్నాయి. ఏ సినిమా లైట్ తీసుకున్నా ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలను మాత్రం అసలు లైట్ తీసుకోకండి.

  • Published May 02, 2024 | 11:42 AMUpdated May 02, 2024 | 11:42 AM
Weekend Suggestion: ఈ వీకెండ్ OTT లోకి రాబోయే..  ఈ 4 సినిమాలను అసలు మిస్ కాకండి!

ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీస్ లు వస్తూనే ఉంటాయి. అలానే గత వారం థియేటర్ లో రిలీజ్ అయినా ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. థియేటర్ లో ఆయా చిత్రాలకు ఎంత ఆదరణ లభించాయో.. ఓటీటీ లోను అంతే ఆదరణ లభించాయి. అలానే ఈ వారం కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, సిరీస్ లు ఓటీటీ లోకి రానున్నాయి . ఆల్రెడీ మే 1 న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయినా హీరామండి : ది డైమండ్ బజార్ సిరీస్ కు విశేష ఆదరణ లభిస్తోంది ఇక ఇప్పుడు ఈ వారం ఇంకా విడుదల కావాల్సిన చిత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏ సినిమాను లైట్ తీసుకున్నా కానీ.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం అసలు లైట్ తీసుకోకండి. మరి ఆ చిత్రాలు ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే వివరాలను చూసేద్దాం.

ఓటీటీ లోకి రాబోయే ఈ నాలుగు చిత్రాలను అస్సలు మిస్ కాకండి. అవేంటంటే..

1. సైతాన్: నెట్ ఫ్లిక్స్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవఘన్, తమిళ నటుడు మాధవన్, జ్యోతిక కలిసి నటించిన ఈ సినిమా.. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్స్ విషయంలోనూ బాక్స్ ఆఫీస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ సినిమా.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మే 3 నుంచి.. నెట్ ఫ్లిక్స్ లోకి రానుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ కాకండి.

2. మంజుమ్మేల్ బాయ్స్: హాట్ స్టార్
ఈ సర్వైవల్ థ్రిల్లర్ గురించి ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్స్ లో ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఇంప్రెస్స్ చేసేసింది. దీనితో ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు.. ఓటీటీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు మే 5 నుంచి.. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. సో ఈ సినిమాను కూడా మిస్ కాకుండా చూసేయండి.

3. సిద్ధార్థ్ రాయ్ : ఆహ
ఇండస్ట్రీలోకి మరొక అర్జున్ రెడ్డి అంటూ.. ప్రమోషన్స్ తో బాగా హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో మాత్రం.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య చాలా వరకు సినిమాను థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా కూడా.. ఓటీటీ లో మాత్రం మంచి వ్యూవర్ షిప్ .. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. మరి ఈ సినిమా ఎటువంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 3 నుంచి ఆహ స్ట్రీమింగ్ కానుంది.

4. వోంకా: జియో సినిమా
ఇది ఒక హాలీవుడ్ సినిమా. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులంతా తెలుగు మాత్రమే కాకుండా.. ఇతర భాషల సినిమాలను కూడా బాగా ఆదరిస్తున్నారు. సో ఈ మూవీ కూడా అందరికి నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 2023 లో థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సినీ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. ఇది ఒక మ్యూజిక్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఈ మూవీ మే 3 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

కాబట్టి ఈ వీకెండ్ రాబోయే ఈ నాలుగు సినిమాలను మాత్రం అసలు లైట్ తీసుకోకండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisJojobetHoliganbetJojobet GirişJojobet - Güncel Giriş Adresi, Bonus ve Üyelik 2026