iDreamPost

మునుగోడులో దూసుకెళ్లిన కారు.. ఉమ్మడి నల్గొండలో TRS హ్యాట్రిక్..

మునుగోడులో దూసుకెళ్లిన కారు.. ఉమ్మడి నల్గొండలో TRS హ్యాట్రిక్..

Munugode By Election Result Counting Live Updates: తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్,బీజేపీ మరియు కాంగ్రెస్ మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. దీంతో.. తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మునుగోడు ఉపఎన్నికపై ఆసక్తి నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి.. బీజేపీకి మధ్య హోరాహోరీగా పోటీ. అయితే.. సిట్టింగ్ స్థానమైన కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. బీఎస్పీ సైతం.. తన పరిధి మేర ఓట్లు రాబట్టుకుందని తెలుస్తోంది.

మునుగోడు విజయం బీజేపీకి చెంపపెట్టు..: కేటీఆర్
నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. మునుగోడు ఉపఎన్నిక విజయం తర్వాత హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్… నల్గొండ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంట్రాక్టులతో తెచ్చిన ఉపఎన్నికలో ప్రజలు బీజేపీకి బుద్ధిచెప్పారన్నారు. అహంకారంతో, డబ్బు మదంతో కళ్లు నెత్తికొక్కి మునుగోడు ఉపఎన్నికను తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దారని కేటీఆర్ విమర్శించారు. దిల్లీ బాసులు మోదీ, అమిత్ షాకు తెలంగాణ ప్రజలు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో కనిపించింది రాజగోపాల్ రెడ్డి అయినా వెనకుండి నడిపించింది దిల్లీ బాసులు అని మండిపడ్డారు. 9 రాష్ట్రాల్లో అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను కూల్చారని, తెలంగాణలో కూడా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు..
హోరాహోరిగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. దాదాపు 11 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందింది. రెండో స్థానంలో బీజేపీ నిలవగా.. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.

మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 10 వేలకు పైగా మెజార్టీ సాధించారు. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6608, బీజేపీకి 5553 ఓట్లు వచ్చాయి. 14వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 1055 ఓట్ల ఆధిక్యం లభించింది. దీంతో మొత్తం మెజార్టీ 10191 ఓట్లకు చేరింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు.

ముందుగా.. హుజూర్ నగర్, తర్వాత నాగార్జున సాగర్, తాజాగా.. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ వరుసగా గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసిన టీఆర్ఎస్ పార్టీ అవతరించింది. తాజా గెలుపుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. కాగా, మునుగోడులో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది.

10వేల మెజార్టీ దాటిన టీఆర్‌ఎస్‌..
14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6,608 ఓట్లు, బీజేపీకి 5,553.

14వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 1055 ఓట్ల లీడ్ కనబర్చింది. 14 రౌండ్లు ముగిసేసరికి 10191 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్.

టీఆర్ఎస్‌కు చివరి ఎన్నిక.. బీఆర్ఎస్‌కు తొలి విజయం..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవలనే.. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు ఉపఎన్నిక చివరిది కానుంది. బీఆర్ఎస్ స్థాపించిన తర్వాత అనధికారికంగా తొలి విజయం కానుంది.

13 రౌండ్ల అప్టేడ్స్ ప్రకారం.. అభ్యర్థులకు పోలైన ఓట్లు..
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి – 88,708
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి – 79,580
పాల్వాయి స్రవంతి -19,415
టీఆర్ఎస్ 9136 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

మరికాసేపట్లో మీడియాతో మంత్రి కేటీఆర్..
మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో తెలంగాణ భవన్ సంబరాల్లో మునిగిపోయింది. బాణా సంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు విజయోత్సవ వేడుకలు చేసుకుంటున్నారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మరికాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు.

బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది: మంత్రి జగదీశ్ రెడ్డి
మునుగోడు ఫలితంతో రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని తేలిపోయింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వరుసగా హ్యాట్రిక్ సాధించాం. మునుగోడు ఎన్నికల్లో ధర్మమే గెలిచింది. ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని మునుగోడు ఫలితం నిరూపించింది. ఓటమిని అంగీకరించకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సాకులు వెతుకుతున్నారు. ఎన్నికల కమిషన్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి దుర్వినియోగానికి పాల్పడింది బీజేపీ నేతలే.. అంటూ జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

13వ రౌండ్ టీఆర్ఎస్ దే, 9 వేలు దాటిన ఆధిక్యం..
13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 6691 ఓట్లు, బీజేపీకి 5406.

13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం 1285 ఓట్ల లీడ్ కనబర్చింది. 13 రౌండ్లు ముగిసేసరికి 9,136 ఓట్ల ఆధిక్యంలో టీఆర్‌ఎస్.

కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు..
మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. 12 రౌండ్ల ఫలితాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాల్వాయి స్రవంతికి 17,627 ఓట్లు వచ్చాయి.

12వ రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ లీడ్‎..
12వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం.. 12 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 7836 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,440 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5,398 ఓట్లు వచ్చాయి. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ 2042 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

కేసీఆర్‌తో తెలంగాణ.. హరీశ్ రావు ట్వీట్..!

Image
మునుగోడులో టీఆర్ఎస్ విజయం దిశగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి తన్నీరు హరీశ్ రావు ట్విట్ చేశారు. ”కేసీఆర్ తో తెలంగాణ” ఉందంటూ ట్వీట్ చేశారు.

మరికాసేపట్లో తెలంగాణ భనవ్‌కు కేటీఆర్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం దిశగా పయనిస్తోంది. దీంతో తెలంగాణ భవన్లో గులాబీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. స్వీట్లు పంచుకుని.. టపాసులు కాల్చుతున్నారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకోనున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ చివరి దశలో కొనసాగుతోంది. 12వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 11 రౌండ్లు ముగిసే సమయానికి టీఆర్ఎస్ 5794 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.

రెండు రౌండ్లలో బీజేపీ.. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్..
మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 11 రౌండ్‌లు పూర్తవ్వగా.. టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది. 2, 3 రౌండ్లు మినహా బీజేపీ ఏ విధంగా ప్రభావం చూపలేకపోయింది. అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యంతో కొనసాగుతోంది.

దూసుకెళ్తున్న టీఆర్ఎస్.. 11వ రౌండ్‌లోనూ ఆధిక్యం..
11వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం.. 11 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 5774 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క 11వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,235 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. 11వ రౌండ్ లో టీఆర్ఎస్ 1358 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

10వ రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ లీడ్‎..
10వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం.. 10 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 4,416 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క 10వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,499 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 7,015 ఓట్లు వచ్చాయి. 10వ రౌండ్ లో టీఆర్ఎస్ 484 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని.. కారును పోలిన గుర్తులు దెబ్బ తీస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈవీఎంలలో కారు మాదిరిగా చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులు ఉన్నాయి. వాటికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయి.

  • కార్‌ను పోలిన గుర్తులకు భారీగా ఓట్లు..

  • TRS మెజారిటీని దెబ్బతీస్తున్న కార్‌ను పోలిన గుర్తులు..

  • చపాతీ మేకర్ – 1169 

  • రోడ్ రోలర్ – 904

    చప్పల్ (రెండో EVM లో రెండో నంబర్ ) – 1142

    మొత్తం – 3215

ఇప్పటికే ఇన్ని ఓట్లు కోల్పోయింది TRS వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీనే లీడ్..  మొత్తం కలిపి 4 వేలకు పైగా ఓట్ల మెజారిటీ..
9వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యం కనబర్చింది. 9వ రౌండ్‌లో టీఆర్ఎస్‌లో 850 ఓట్ల ఆధిక్యం సాధించింది. మొత్తం 9 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ పార్టీ 4 వేల ఓట్ల ఆధిక్యం సంపాదించింది.  9, 10 రౌండ్లలో చండూరు మండల ఓట్ల లెక్కింపు ఉంది. అయితే, ఈ ప్రాంతాలు తమకు బాగా ఓట్లు కురిపిస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. అయితే, 9వ రౌండ్ కూడా టీఆర్ఎస్‌కే సొంతం అయింది. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు పోలైన ఓట్లు 7497, బీజేపీ 6665. 9వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ లీడ్ 832. మొదట్లో చౌటుప్పల్ మండలంలో కూడా బీజేపీకి ఎక్కువ మెజారిటీ వస్తుందనుకొని భావించినా అక్కడ టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చిన సంగతి తెలిసిందే.

ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివేలలో బీజేపీ లీడ్..
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అత్త గారి గ్రామం పలివేల గ్రామంలో 400 ఓట్లకు పైగా బిజెపి లీడ్. టీఆర్ఎస్‌ పార్టీ నుంచి ఇదే గ్రామానికి ఇంచార్జ్ గా ఉన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

TRS Lead in Munugode: 8వ రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ లీడ్‎..
8వ రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం.. 8 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 3,091 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క 8వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,624 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 6,088 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్ లో టీఆర్ఎస్ 536 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో మొత్తం 1, 4, 5, 6, 7, 8 రౌండ్లలో ఆధిక్యం లభించినట్లయింది. కేవలం 2, 3 రౌండ్లలోనే బీజేపీకి ఆధిక్యంలో ఉండగలిగింది.

7వ రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్‎..
రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం.. ఏడు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 2,555 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క 7వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,189 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 6,803 ఓట్లు వచ్చాయి. 7వ రౌండ్ లో టీఆర్ఎస్ 386 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

ఆరో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ లీడ్‎..
ఆరో రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ ఆధిక్యం కనబర్చింది. ఆరు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 2,169 ఓట్ల లీడ్ కనబర్చింది. ఒక్క ఆరో రౌండ్ లో టీఆర్ఎస్ కు 6,016 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 5,378 ఓట్లు వచ్చాయి. 1, 4, 5, 6 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా.. 2,3 రౌండ్లలో బీజేపీ లీడ్‎లో ఉంది. ప్రస్తుతం ఏడవ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది.

ఫలితాల వెల్లడిలో జాప్యంపై క్లారిటీ ఇచ్చిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్
మునుగోడు ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడిలో జాప్యంపై చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ బుద్ధ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. 4th రౌండ్ కి 5th రౌండ్ కి 20 నిమిషాలు లేట్ అయ్యింది అంతేనని అన్నారు. ఏదైనా కారణం వల్ల లేట్ అయితే తాము ఏమి చేయగలమని అన్నారు. మన దగ్గర అభ్యర్థులు ఎక్కువగా ఉండడం వల్లనే లేట్ అవుతుందని అన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం చేసిన తరువాతనే రిజల్ట్ లు రౌండ్ ల వారీగా వస్తాయని చెప్పారు. ప్రతి రౌండ్ ముగియగానే మీడియాకు సమాచారం ఇస్తున్నామని అన్నారు.

ఐదో రౌండ్లో టీఆర్ఎస్ లీడ్.. 
5వ రౌండ్‎లో టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. టీఆర్ఎస్ – 6,162, బీజేపి – 5,245 ఓట్లు రాగా, ఐదవ రౌండ్ లో టీఆర్ఎస్ 917 ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో ఐదు రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ 1,430 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంది.. అయితే మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో కేఏ పాల్ -174, రోడ్డు రోలర్ -335, చపాతీ రోలర్-483, నోటా- 142 ఓట్లు పడ్డాయి.

200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం: కేఏ పాల్
మునుగోడు ఉస ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఇవ్వడం లేదు: బీజేపీ ఎంపీ బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్‌లోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని మండిపడ్డారు. బీజేపీ లీడ్‌లోకి వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని తెలిపారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్‌ చేశాడు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేని ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.

అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు: శ్రీధర్ బాబు
మునుగోడు ఎన్నికలో ధనం, మద్యం ఎలా వెదజల్లాయో చూశామన్నారు కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు. టీఆర్ఎస్, బీజేపీ అధికార బలాన్ని కూడా ఉపయోగించాయన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిందన్నారు కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి.

వికాస్ రాజ్‌కు ఈటల రాజేందర్ సూచన..
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడారు ఈటల రాజేందర్. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చింది. ఫలితాలు సక్రమంగా వెల్లడించండి. గెలుపు, ఓటములు సహజం కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండని వికాస్ రాజ్‌కు సూచించారు ఈటల రాజేందర్.

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జాప్యం పైన టీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం..
రౌండ్ ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం కావడంపైన మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

సీఈవో వైఖరి అనుమానాస్పదంగా ఉంది..: బీజేపీ ఎంపీ బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా సీఈవో ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను సీఈవో వెల్లడించడం లేదని విమర్శించారు. మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని బండి సంజయ్ నిలదీశారు. మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఫలితాల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు.

ఫలితాల వెల్లడిలో జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం..
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై ఎందుకు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను ప్రశ్నించారు కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను ఎలా అప్ లోడ్ చేశారని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ సీరియస్‌గా తీసుకుంది.

అధికారిక లెక్కల్లో టీఆర్ఎస్ లీడ్.. ఎంతంటే..
నాలుగు రౌండ్లు ప్రకారం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. 714 ఓట్లు లీడ్‌లో టీఆర్ఎస్ ఉందని ఈసీ వెల్లడించింది. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార టీఆర్ఎస్, విపక్ష బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో ఆధిక్యం కనబచరిన టీఆర్ఎస్.. ఆ వెంటనే వెనుకబడి.. తిరిగి మళ్లీ వెంటనే పుంజుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ మండలంలో తొలి రౌండ్ లో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 2,3 రౌండ్లలో బీజేపీ ఆధిక్యంలోకి రాగా.. నాలుగో రౌండ్ ముగిసేసరికి తిరిగి టీఆర్ఎస్ పుంజుకుంది. వెరసి బీజేపీకి మంచి పట్టుందని భావించిన చౌటుప్పల్ లో టీఆర్ఎస్ 613 ఓట్ల ఆధిక్యత సాధించింది..

మునుగోడు ఓట్ల లెక్కింపులో తొలుత చౌటుప్పల్ మండల పరిధిలోని ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ మండలంలోని ఓట్లను మొత్తంగా 4 రౌండ్లలో లెక్కించగా… టీఆర్ఎస్ కు 613 ఓట్ల ఆధిక్యత లభించింది. తొలి రౌండ్ లో వెయ్యికి పైగా ఓట్ల ఆధిక్యాన్ని సాధించిన టీఆర్ఎస్.. ఆ వెంటనే 2, 3 రౌండ్లలో వెనుకడిపోయింది. అయితే నాలుగో రౌండ్ తో చౌటుప్పల్ మండలం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి బీజేపీని వెనక్కు నెట్టేసి తిరిగి టీఆర్ఎస్ ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. నాలుగో రౌండ్ లో ఏకంగా 1,034 ఓట్ల ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్.. ఓవరాల్ గా బీజేపీపై 613 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. నాలుగో రౌండ్ లెక్కింపుతో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపును పూర్తి చేసిన అధికారులు.. ఆ తర్వాత సంస్థాన్ నారాయణపూర్ మండల ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు.

Komatireddy Rajagopal Reddy: బీజేపీనే గెలుస్తుందనే నమ్మకం ఉంది – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఓవైపు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతుండగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘చౌటుప్పల్ మండలంలో మేము అనుకున్న మెజార్టీ రాలేదు. ఇప్పటివరకైతే టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. చివరి వరకు హోరాహోరి పోరు తప్పక పోవచ్చు. కానీ, బీజేపీ గెలుస్తుందనే నమ్మకం మాత్రం ఉంది’’ అని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

టీఆర్ఎస్ అభ్యర్థికి షాక్. స్వగ్రామంలో కూసుకుంట్ల వెనుకంజ. లింగవారి గూడంలో బీజేపీ ఆధిక్యం.

ముంత్రులు ఇంఛార్జీలుగా ఉన్న చోట కారుకు బ్రేకులు..
తొలి రౌండ్‌లో లీడ్ దక్కించుకున్న టీఆర్ఎస్.. ఆతర్వాత వెనుకబడింది. రెండో రౌండ్ నుంచి ఐదవ రౌండ్ వరకు బీజేపీ ఆధిక్యం దక్కించుకుంది. అయితే మంత్రులు ఇంఛార్జీలుగా వ్యవహరించిన మండలాల్లో బీజేపీకి లీడ్ రావడం ఆశ్చర్యానికి గురి చేసింది.

మంత్రి మల్లారెడ్డి ఇంఛార్జ్ గా ఉన్న ఆరెగూడెం, కాటరేవురెడ్డివారి గ్రామంలో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. మరోవైపు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంఛార్జిగా ఉన్న లింగోజిగూడెంలోనూ బీజేపీనే అధిక్యంలోకి వచ్చింది. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న దేవులమ్మ నాగారంలో బీజేపీ లీడ్ వచ్చింది.

Munugode Election Counting News Live: నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తి, టీఆర్ఎస్ లీడ్ 334 ఓట్లు
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ – 4,854
బీజేపీ – 4,555
టీఆర్ఎస్ లీడ్ – 299
నాలుగు రౌండ్లు ముగిసేసరికి టీఆరెఎస్ లీడ్ 334 ఓట్లు

ఎవరెవరికి ఎన్ని ఓట్లు.. ఈసీ చెప్పిన లెక్క ఇదే..

ఎన్నికల అధికారులు ఇచ్చిన అధికారిక లెక్కల ప్రకారం ఓట్ల ఫలితాలు ఇలా ఉన్నాయి.

EC Announcement on First Round

BJP Lead in Third Round: మూడో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..
రెండో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ 563 ఓట్ల ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ లీడ్ కాగా, రెండో రౌండ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. మూడో రౌండ్ కూడా బీజేపీనే ఆధిక్యంలో నిలిచింది. దాదాపు వెయ్యి ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.

మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌లో రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ ముందంజలోకి వచ్చేసింది. మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రెండో రౌండ్ లో 900 పైచిలుకు ఓట్ల లీడ్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ప్రస్తుతం మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది.

Munugode First Round Results: తొలి రౌండ్ లో ఫలితాలు ఇవీ..

తొలి రౌండ్ లో టీఆర్ఎస్ – 6096
బీజేపీ – 4,904
కాంగ్రెస్ – 1877
లీడ్ – 1192

Munugode Postal Ballot Votes: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది.

టీఆర్ఎస్ – 228
బీజేపీ – 224
బీఎస్పీ – 10
4 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్

Munugode Election Counting: ఓట్ల లెక్కింపులో 250 మంది సిబ్బంది
మునుగోడు ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 250 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కౌంటింగ్ కోసం 100 మందిని కేటాయించగా, దాని సంబంధిత పనుల కోసం 150 మందిని కేటాయించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి