iDreamPost

Tilak Varma : ముంబై ఇండియన్స్‌లో అదరగొడుతున్న మన తెలుగోడు.. ఇతని గురించి తెలుసా?

Tilak Varma : ముంబై ఇండియన్స్‌లో అదరగొడుతున్న మన తెలుగోడు.. ఇతని గురించి తెలుసా?

 

 

 

ఇటీవల ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్ లో తన రెండవ మ్యాచ్‌లోనే 33 బంతుల్లో 66 పరుగులతో అర్ధసెంచరీని సాధించి అత్యంత పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ముంబై ఇండియన్స్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు తిలక్ వర్మ. ఇతనికి కేవలం 19 ఏళ్ళు. ఒకప్పుడు విరిగిన బ్యాట్‌తో ఆడి అండర్ 16కి సెలెక్ట్ అయిన తిలక్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ లో అదరగొడుతున్నాడు.

 

తిలక్ వర్మ హైదరాబాదులో సామాన్య కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి నంబూరి నాగరాజు ఎలక్ట్రీషియన్ మరియు తల్లి గృహిణి. వారి ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా కొడుకుకి ఇష్టమైన క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. కానీ అందుకు కావాల్సిన మంచి కిట్ కొనలేని పరిస్థితి. ఒకసారి ప్రాక్టీస్ లో బ్యాట్ విరిగితే కొనివ్వడానికి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు లేవు. దీంతో ఆ విరిగిన బ్యాట్ తోనే అండర్ 16లో ఎక్కువ రన్స్ చేశాడు. తన ఆటని గుర్తించి కోచ్ సలాం బయాశ్ మంచి క్రికెట్ కిట్ కొనిచ్చి, మంచి కోచింగ్ కూడా ఇచ్చాడు.

రంజీ, U-16, U-19 ప్రపంచకప్ వరకు తన అద్భుతమైన ఆటతో ఆడాడు. అతను IPL వేలం కోసం షార్ట్‌లిస్ట్ అయ్యాడని తెలిసి అంతా చాలా ఆనందించారు. తిలక్ బేసిక్ ధర 20 లక్షలు ఉండగా ఒక కోటి 70 లక్షలకి తిలక్ అమ్ముడయ్యాడు. తిలక్ కోసం హైదరాబాద్, చెన్నై, రాజస్థాన్, ముంబై పోటీ పడగా ముంబై ఇండియన్స్ టీం ఆ రేటుకి తిలక్ వర్మని కొనుక్కుంది. చిన్నప్పటి నుంచి తిలక్ ముంబై టీం ఫ్యాన్ అవ్వడంతో అదే టీం అతన్ని కొనుక్కోగా చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున ప్రతి మ్యాచ్ లోను అద్భుతమైన ఆటని చూపిస్తున్నాడు. అతనికి ఆర్థిక సమస్యలు ఉండటంతో ఇప్పుడు వచ్చే డబ్బులతో తమ పేరెంట్స్ కి మంచి ఇల్లు కట్టిస్తాను అని తెలిపాడు తిలక్. అతను IPLలో ఆడుతుండటంతో తల్లిదండ్రులు, కోచ్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తిలక్ ఇండియా టీంకి ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి