iDreamPost

IPL 2024: RRతో మ్యాచ్‌కి ముందు హార్ధిక్‌ పాండ్యాకు ఘోర అవమానం!

  • Published Apr 01, 2024 | 5:31 PMUpdated Apr 01, 2024 | 5:31 PM

Hardik Pandya, Mumbai Indians, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ కంటే ముందు ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు ఘోర అవమానం ఎదురైంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

Hardik Pandya, Mumbai Indians, IPL 2024: రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ కంటే ముందు ముంబై ఇండియన్స్‌ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు ఘోర అవమానం ఎదురైంది. అదేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

  • Published Apr 01, 2024 | 5:31 PMUpdated Apr 01, 2024 | 5:31 PM
IPL 2024: RRతో మ్యాచ్‌కి ముందు హార్ధిక్‌ పాండ్యాకు ఘోర అవమానం!

ఇప్పటికే దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్న హార్ధిక్‌ పాండ్యాకు మరో ఘోర అవమానం జరిగింది. అది కూడా ఎంతో కీలకమైన రాజస్థాన్‌ రాయల్స్‌తో సోమవారం హోం గ్రౌండ్‌ వాంఖడే క్రికెట్‌ స్టేడియంలో మ్యాచ్‌కి ముందు ఈ అవమానం ఎదురైంది. ఇప్పటికే పాండ్యా పేరు చెబితే చాలా స్టేడియానికి వస్తే.. ప్రేక్షకులు బో అంటూ తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. ఇది కాకుండా సోషల్‌ మీడియాలో హార్ధిక్ పాండ్యాపై ఒక రేంజ్‌లో ట్రోలింగ్‌ జరుగుతోంది. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా పాండ్యా పేరు ప్రకటించినప్పటి నుంచి ఈ ట్రోలింగ్‌ జరుగుతోంది.

అలాగే ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఈ సీజన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌కు నిలబెట్టడంతో.. ముంబై, రోహిత్‌ అభిమానులు పాండ్యాపై దారుణంగా విరుచుకుపడుతున్నారు. ఆ మ్యాచ్‌లనే గ్రౌండ్‌లోకి కుక్క వస్తే.. అంతా హార్ధిక్‌.. హార్ధిక్‌.. అంటూ మొత్తుకున్నారు. ఇలా ఏ భాతర క్రికెటర్‌ కూడా ఎదుర్కొని వ్యతిరేకతను ప్రస్తుతం పాండ్యా ఎదుర్కొంటున్నాడు. అయితే.. ప్రస్తుతం ఈ అవమానం అతనికి కెప్లెన్సీ వల్ల ఎదురైంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటి వరకు అంటే.. ఆదివారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఒక్క విజయం కూడా సాధించని జట్టుకు ముంబై ఇండియన్స్‌ నిలిచింది.

ఇప్పటి వరకు ప్రతి టీమ్‌ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడింది. కొన్ని టీమ్స్‌ మూడు మ్యాచ్‌లు ఆడాయి. మిగిలిన 9 టీమ్స్‌ కనీసం ఒక్క విజయం అయినా సాధించాయి. కానీ, ఒక్క ముంబై ఇండియన్స్‌ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేదు. రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ ఓడిపోయింది. గుజరాత్‌, సన్‌రైజర్స్‌తో ఆడిన మ్యాచ్‌ల్లో ముంబై చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఒక వేళ మంగళవారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగే మ్యాచ్లో గెలిచినా.. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో తొలి విజయం సాధించిన చివరి టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ నిలుస్తుంది. అన్ని టీమ్స్ బోణి కొట్టిన తర్వాత విజయం అందుకున్న టీమ్‌గా నిలుస్తుంది. ఒక వేళ ఓడిపోతే.. తొలి గెలుపు కోసం ఎదురుచూడాల్సిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్‌ అట్టడుగు స్థానంలో ఉంది. మరి కెప్టెన్‌గా పాండ్యా పేరిట ఈ చెత్త రికార్డు నమోదు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి