iDreamPost

మల్టీ స్టారర్ కు మహా చిక్కు వచ్చిందే

మల్టీ స్టారర్ కు మహా చిక్కు వచ్చిందే

భారీ అంచనాలతో దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13 వచ్చే అవకాశాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. చేతిలో ఇంకో రెండు నెలల సమయం మాత్రమే ఉండటం, దీని రేంజ్ కు తగ్గ హైప్ రాకపోవడం, కేరళ లాంటి రాష్ట్రాల్లో నవంబర్ దాకా పూర్తి స్థాయిలో థియేటర్లు తెరిచే అవకాశం లేకపోవడంతో ఈ పాన్ ఇండియా మూవీకి పోస్ట్ పోన్ తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. రాజమౌళి టీమ్ ఇండియాకు తిరిగి రాగానే దీనికి సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్. దానికి తోడు నార్త్ లోనూ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఇంత గందరగోళం మధ్య రిస్క్ అవసరమా అనే ఆలోచన రావడం సహజం.

ఒకవేళ ఇది నిజమైతే ఆర్ఆర్ఆర్ కు రెండు ఛాయస్ లు ఉంటాయి. సంక్రాంతి బరిలో దిగడం అసాధ్యం. ఆల్రెడీ మూడు భారీ చిత్రాలు అనౌన్స్ మెంట్లు ఇచ్చాయి కాబట్టి నైతికంగానూ ఆ సీజన్ కు రావడం కరెక్ట్ కాదు. అప్పుడు జనవరి 26కి వెళ్లడం కొంత మంచి ఫలితాన్ని ఇవ్వొచ్చు. లేదూ అనుకుంటే 2022 సమ్మర్ తప్ప ఇంకెప్పుడు రిలీజ్ చేసినా కలిగే ప్రయోజనం తక్కువే. అందుకే జక్కన్న టీమ్ ఈ విషయం గురించే తీవ్ర స్థాయిలో మల్లాగుల్లాలు పడుతున్నట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటర్లు సైతం అంతా బాగున్నప్పుడే ఆర్ఆర్ఆర్ లాంటి గ్రాండియర్స్ రావాలని కోరుకుంటున్నారు. చిన్న ఆందోళన సైతం కలెక్షన్ల మీద ప్రభావం చూపిస్తుంది.

సో ఇప్పటికే మూడు నాలుగు సార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ కు కొత్ డేట్ ఇప్పుడే చెప్పేస్తారా లేక అంతా సద్దుమణిగాక అప్పుడు ప్రకటిస్తామని అంటారా అనేది వేచి చూడాలి. నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆర్ఆర్ఆర్ బిజినెస్ కూడా దానికి తగ్గట్టే జరిగింది. అన్ని బాషలకు కలిపి వెయ్యి కోట్ల రిటర్న్స్ ని ఆశిస్తోంది. అది జరగాలంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి లేకుండా సాధారణ జనజీవనం నెలకొనాలి. కానీ అది చెప్పుకున్నంత సులభం కాదు. ఇప్పుడైతే థర్డ్ వేవ్ గండం లేదు కానీ రాబోయే రెండు మూడు నెలలను తక్కువ అంచనా వేయడానికి లేదు. సో రిలీజ్ మీద ఇప్పట్లో ధీమా పెట్టుకోక పోవడం మంచిది

Also Read : గాడ్ ఫాదర్ కు పాన్ ఇండియా స్కెచ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి