iDreamPost

ముఖ్బిర్ ది స్టోరీ అఫ్ ఏ స్పై రిపోర్ట్..!

ముఖ్బిర్ ది స్టోరీ అఫ్ ఏ స్పై రిపోర్ట్..!

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల నిర్మాణం ఊపందుకుంది. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి దిగ్గజాలతో పోటీ పడేందుకు జీ5 కూడా తన వంతుగా భారీ బడ్జెట్ లతో ప్రొడక్షన్ చేస్తోంది. అందులో భాగంగా వచ్చిందే ముఖ్బీర్ ది స్టోరీ అఫ్ ఏ స్పై. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర చేయడంతో పాటు ప్రోమోలు గట్రా ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి కలిగింది. అందులోనూ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. శివరామ్ నాయర్-జయప్రద్ దేశాయ్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల నిడివితో వచ్చింది. ఒక్కో భాగం నలభై నిమిషాల దాకా సాగింది. కంటెంట్ ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

కథ 1965లో సాగుతుంది. ఇండియన్ ఇంటెలిజెన్స్ లో పని చేసే అధికారి మూర్తి(ప్రకాష్ రాజ్)కి పాకిస్థాన్ జరపబోయే దాడుల గురించి కొంత సమాచారం అందుతుంది. దాని గుట్టు తెలుసుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేసే కమ్రాన్ బక్ష్(జైన్ ఖాన్ దురాని)ని అతి కష్టం మీద ఒప్పించి అక్కడి ఓ కుటుంబంలో తప్పిపోయి తిరిగి వచ్చిన కొడుగ్గా పంపిస్తాడు. మారుపేరుతో శత్రుదేశం చేరుకున్న కమ్రాన్ మెల్లగా పాక్ ఆర్మీ ఆఫీసర్లతో పాటు వాళ్లకు చనువుగా ఉండే అమ్మాయిలతో స్నేహం పెంచుకుంటాడు. ఈ క్రమంలో ఎన్నో ప్రమాదకరమైన సవాళ్ళను ఎదురుకోవాల్సి వస్తుంది. చివరికి మూర్తి ఇచ్చిన మిషన్ ని కమ్రాన్ ఎలా పూర్తి చేసుకొచ్చాడనేదే స్టోరీ.

అలియా భట్ రాజీని బాగా ఇష్టపడిన వాళ్లకు ఈ ముఖ్బీర్ మాములుగా అనిపిస్తాడు. ఆ స్థాయి టెంపో ఇందులో లేదు. పాత్రలను ఎస్టాబ్లిష్ చేసిన తీరు అతి మాములుగా ఉండటంతో పాటు పోరాట ఘట్టాలల్లో అంత థ్రిల్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇంటెన్సిటీ తగ్గడం ముఖ్బీర్ లోని ప్రధాన మైనస్. ఆర్టిస్టులందరూ బాగా చేశారు. హిందీలో ప్రకాష్ రాజ్ స్వంతంగా డబ్బింగ్ చెప్పించారు కానీ తెలుగులో వేరే గొంతు వినిపిస్తుంది. అప్పటి వాతావరణాన్ని పునఃసృష్టించిన ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోకుండా ఉండలేం. గూఢచారి జానర్ ని విపరీతమైన అభిమానించే వాళ్లకు టైం పాసే కానీ రెగ్యులర్ ఆడియన్స్ మాత్రం పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి