iDreamPost

అమ్మాయిలకు ఇలాంటి బాయ్ బెస్టీ ఉంటే చాలా లక్కీ! ఎలా ఉండాలంటే ?

  • Published Feb 01, 2024 | 3:48 PMUpdated Feb 01, 2024 | 3:48 PM

బాయ్ బెస్టీ అనే పదాన్ని ఈ మధ్య మనం తరచూ వింటూనే ఉంటున్నాం. అయితే, అసలు బాయ్ బెస్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి. ఎటువంటి బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిలు లక్కీ.. అనే విషయాలను తెలుసుకుందాం.

బాయ్ బెస్టీ అనే పదాన్ని ఈ మధ్య మనం తరచూ వింటూనే ఉంటున్నాం. అయితే, అసలు బాయ్ బెస్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి. ఎటువంటి బాయ్ బెస్టీ ఉన్న అమ్మాయిలు లక్కీ.. అనే విషయాలను తెలుసుకుందాం.

  • Published Feb 01, 2024 | 3:48 PMUpdated Feb 01, 2024 | 3:48 PM
అమ్మాయిలకు ఇలాంటి బాయ్ బెస్టీ ఉంటే చాలా లక్కీ! ఎలా ఉండాలంటే ?

ప్రస్తుతం సమాజం అటు టెక్నాలజీలో కానీ.. ఇటు రిలేషన్ షిప్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ చాలా ఫాస్ట్ గా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రిలేషన్ షిప్ మెయింటైన్ చేసే విషయాల్లో.. టెక్నాలజీ కంటే రెండింతలు ఫాస్ట్ గానే ఉంది. ప్రేమ అనే పదానికి అర్ధమే మార్చేశారు ఇప్పటి యువత. ఎవరు ఎంతకాలం కలిసి ఉంటున్నారో.. ఎవరు చెప్పలేకపోతున్నారు. కాసేపు వారి సరదాలు.. సంతోషాలు తీరిపోయిన తరువాత ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అలాగే లవ్ తో పాటు ఈరోజుల్లో ఎక్కువగా వినిపించే ఇంకో పదం బాయ్ బెస్టీ. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ బాయ్ బెస్టీ అనే కాన్సెప్ట్ మీద చాలా ట్రోల్ల్స్ చేస్తూ వస్తున్నారు. చాలా వరకు దీనిని నెగెటివ్ గానే చూస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్క మొలిచినట్లుగా.. నేడు సమాజం అంతా గంజాయి వనంలానే తయారయింది. దాని కారణంగా తులసికి విలువ లేకుండా గంజాయి మొక్కలానే చూస్తున్నారు. ఇక్కడ బాయ్ బెస్టీ అంటే.. తులసి అంత పవిత్రం అని చెప్పడం ఉద్దేశం కాదు. కాకుంటే.. ఓ మంచి బాయ్ బెస్టీ ఉంటే.. ఆ రిలేషన్ కూడా పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది అని చెప్పడం. మరి ఎలాంటి లక్షణాలు ఉన్న బాయ్ బెస్టీ దొరికితే అమ్మాయిలు లక్కీనొ ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1) నమ్మకం: ఒక అమ్మాయి ఒక అబ్బాయితో సేఫ్ గా సెక్యూర్డ్ గా ఫీల్ అవుతోంది అంటే.. ఆ అబ్బాయి ఆ అమ్మాయి నమ్మకాన్ని గెలుచుకున్నట్లే. అంతేకాకుండా అబ్బాయిలు ఆ నమ్మకాన్ని  నిలబెట్టుకునేలా ప్రవర్తించాలి. వారికీ ఏ ప్రాబ్లమ్ వచ్చినా .. షేర్ చేసుకోడానికి ఒకరు ఉన్నారు అనే ధైర్యాన్ని అబ్బాయిలు.. అమ్మాయిలకు ఇవ్వగలగాలి.

2) కేర్ : ప్రతి అబ్బాయి తన స్నేహితురాలిని ప్రొటెక్ట్ చేస్తూ చాలా కేరింగ్ గా చూసుకోవాలి. బయట వ్యక్తుల నుంచి ఆ అమ్మాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయకుండా చూసుకోగలగాలి. ఇలా తనతో స్నేహం చేసే అమ్మాయిని జాగ్రత్తగా చేసుకున్నట్లైతే..వారి స్నేహాన్ని విడదీయడం ఎవరి వలన కాదు.

3) సమయం కేటాయించడం: సమయం కేటాయించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ ను కనుక గడిపినట్లైతే.. ఇరువురి మధ్య బాండింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే తప్పు ఒప్పులు తెలుసుకునే వీలు ఉంటుంది. ఆరోజు వారు ఎలా గడిపారు ఏం చేశారు అనే విషయాలను పంచుకోవడానికి.. వారికంటూ ఒక మనిషి ఉన్నాడు అనే భావన కలుగుతుంది.

Boy bestie to girl

4) తప్పుల్ని ఎత్తి చూపడం: స్నేహితుడు అంటే కేవలం మనతో ఉండే ఓ వ్యక్తి మాత్రమే కాదు. మన తప్పు ఒప్పులను సరిదిద్దేవాడు కూడా. మనం చేసే తప్పులను మన ముందు దైర్యంగా చెప్పేవాడే అసలైన స్నేహితుడు. అలా మన తప్పులను ఎవరైతే ఎత్తి చూపిస్తారో.. వారు ఎప్పటికి ఒక మంచి మార్గదర్శకులుగా నిలిచిపోతారు.

5) మన మంచిని కోరుకోవడం: ఒకరు మన తప్పు ఒప్పులను సరిచేస్తున్నారు అంటే.. పరోక్షంగా మన మంచిని కోరుకున్నట్లే. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా.. మన వెనుక నీడలా ఉంటూ.. మనకు తెలియకుండా మన మంచిని కోరుకుంటూనే ఉంటాడు. అందరిలా నలుగురిలో ప్రశంసించకపోయినా.. ఎప్పుడు మన మంచినే కోరుకునే ఒకే ఒక వ్యక్తి స్నేహితుడు.

6) ఆనందంగా ఉంచడం : స్నేహ బంధం అంటే కేవలం తోడుగా ఉండడమే కాదు. ఎటువంటి సందర్భాల్లో అయినా ఎదుటివారిని ఆనందంగా ఉంచగలగాలి. ఇలా ఏ ఇద్దరైనా వారి బంధంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నట్లయితే.. వారి జర్నీలో ఎదురయ్యే ఏ ప్రాబ్లమ్ కైనా .. సులువుగా సమాధానం దొరుకుతుంది.

7) జెన్యూన్ గా ఉండటం: స్నేహ బంధంలో ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం నిజాయితీ. ప్రతి ఒక్కరు ఒకరి పట్ల ఒకరు నిజాయితీగా మసలుకోవాలి. వారిద్దరూ ఎంత హ్యాపీగా ఉన్నా.. ఎన్ని ప్రాబ్లమ్స్ ను కలిసి సాల్వ్ చేసుకున్నా.. నిజాయితీగా లేకపోతే మాత్రం ఆ బంధం ఎక్కువకాలం కొనసాగలేదు. కాబట్టి నిజాయితీగా ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం.

ఇలా ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య స్నేహ బంధం నిలబడాలి అంటే.. ఇటువంటి లక్షణాలను వారు ఖచ్చితంగా కలిగి ఉండాలి. పైన చెప్పిన లక్షణాలు కలిగిన అబ్బాయిలు.. ఇప్పుడున్న సమాజంలో ఉండడం చాలా అరుదు. ఒకవేళ ఇప్పటికే ఇలాంటి లక్షణాలు కలిగిన బాయ్ బెస్టీ కనుక అమ్మాయిలకు ఉన్నట్లయితే.. వారు చాలా అదృష్టవంతులని చెప్పి తీరాలి. ఏదేమైనా ఇప్పుడున్న సమాజంలో బాయ్ బెస్టీ లకు ఉండే అర్ధాన్నే మార్చేశారు. కానీ, పైన చెప్పుకున్న లక్షణాలు కలిగిన అబ్బాయిలు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నారు. కాబట్టి దీనిని చెడుగా చూసే వారు.. వారి దృష్టి కోణాన్ని కాస్త మార్చుకున్నట్లైతే.. స్నేహం అనే పదానికి ఉన్న గౌరవం ఇంకాస్త పెరుగుతుంది. మరి, బాయ్ బెస్టీలకు ఉండాల్సిన లక్షణాల విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి