iDreamPost

కొడుకు పెళ్లిలో ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

  • Published Mar 02, 2024 | 2:28 PMUpdated Mar 02, 2024 | 2:28 PM

అంబానీ ఇంట పెళ్లి వేడుకలంటే.. ప్రపంచం దృష్టి అంతా వీరిపైనే ఉంటుంది. ఇక నిన్నటి నుంచి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకలకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు స్పెషల్ అప్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

అంబానీ ఇంట పెళ్లి వేడుకలంటే.. ప్రపంచం దృష్టి అంతా వీరిపైనే ఉంటుంది. ఇక నిన్నటి నుంచి అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకలకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు స్పెషల్ అప్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

  • Published Mar 02, 2024 | 2:28 PMUpdated Mar 02, 2024 | 2:28 PM
కొడుకు పెళ్లిలో ముకేశ్‌ అంబానీ-నీతా అంబానీ  డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, భారత కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్ అంబానీ- నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకు.. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ అధినేత వీరెన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్ కు ఈ ఏడాది జులైలో వివాహం జరగనున్న సంగతి తెలిసిందే.అయితే ఈ వివాహ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే 3 రోజుల పాటు జరిగే ఈ ముందస్తు వేడుకల్లో అంబానీ ఇంట పండగ వాతవరణం నెలకొంది. నిన్న అనగా మార్చి 1న అనంత్ అంబానీ, రాధిక మార్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు పారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీలు స్పెషల్ అప్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అలాగే ఈ జంట ఆ రోమాంటిక్ సాంగ్ కు చిందులు వేస్తూన్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

అంబానీ ఇంట పెళ్లి వేడుకలంటే.. ప్రపంచం దృష్టి అంతా వీరిపైనే ఉంటుంది. ఇక అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ వేడుకలకు సంబంధించి నిన్నటి నుంచే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ప్రారంభమైయ్యాయి. కాగా, మార్చి 1 నుంచి 3 మధ్య వరకు 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలను అత్యంత ఘనంగా గుజరాత్ లోని జామ్ నగర్ లో నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే నిన్న అనగా శుక్రవారం మార్చి 1 న సాయంత్రం ‘An Evening in Everland’ పేరిట కాక్‌టెయిల్ పార్టీ నిర్వహించారు. డ్రోన్ షో సహా అంతర్జాతీయ పాప్ ఐకాన్ రిహాన్నా గొప్ప ప్రదర్శనతో ఈ గాలా వేడుకలు మొదలయ్యాయి. అయితే ఈ వేడుకల్లో భాగంగా ముకేశ్ అంబానీ, నీతా అంబానీలు స్పెషల్ అప్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తమ కూమరుని ప్రీ వెడ్డింగ్ వేడకలకు వచ్చిన అతిథుల్ని తమ సుపర్ రొమాంటిక్ ప్రదర్శనతో ఆశ్చర్యపరిచారు. కాగా, వారిద్దరూ 1955ల్లో వచ్చిన బాలీవుడ్ లెజెండ్ రాజ్‌కపూర్ సినిమాలోని మెలోడీ సాంగ్ – ప్యార్ హువా ఇక్రార్ హువా హై’ అనే పాటకు డ్యాన్స్ రీహార్సల్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ, ఇది ఇప్పటిదేనా..పాతదా అనే దానిపై స్పష్టత లేదు.

ఇక ముకేశ్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఏర్పాట్లు ఘనంగా చేశారు. కాగా, ఈ వేడుకలకు అంతర్జాతీయ పాప్ ఐకాన్ రిహాన్నాతో సహా ఫేస్‌బుక్ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ దంపతులు, మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ , అలాగే భారత దిగ్గజ క్రికెటర్లు సచిన్, మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత భారత క్రికెటర్లు, అలాగే బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, అమిర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొణె తదితర నటి నటులతో పాటు, ఇటు టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు తదితరులు పాల్గొని సందడి చేశారు. ఇక అనంత్ అంబానీ పెళ్లి కోసం ముకేశ్ అంబానీ దాదాపు రూ. 1000 కోట్లకు పైనే ఖర్చు పెడుతున్నట్లు సమాచారం అందింది. ఇక అందులో రిహాన్నా ప్రదర్శనకే ఏకంగా రూ. 70 కోట్ల వరకు చెల్లిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి, అనంత్ అంబానీ, రాధిక మర్చెంట్ ల ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల రొమాంటిక్ ప్రదర్శన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి