iDreamPost
android-app
ios-app

వీడియో: కొడుకు స్పీచ్​కు ముకేశ్ అంబానీ ఎమోషనల్.. కన్నీళ్లు ఆపుకోలేక..!

  • Published Mar 02, 2024 | 4:52 PM Updated Updated Mar 02, 2024 | 4:52 PM

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్​లో ముకేశ్ ఎమోషనల్ అయ్యారు.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కొడుకు అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్​లో ముకేశ్ ఎమోషనల్ అయ్యారు.

  • Published Mar 02, 2024 | 4:52 PMUpdated Mar 02, 2024 | 4:52 PM
వీడియో: కొడుకు స్పీచ్​కు ముకేశ్ అంబానీ ఎమోషనల్.. కన్నీళ్లు ఆపుకోలేక..!

ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ ముకేశ్ అంబానీ కొడుకు అనంత్-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జామ్​నగర్​లో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్​లో దేశ, విదేశాల నుంచి సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. మార్చి 1వ తేదీన స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్.. మార్చి 3వ తేదీ దరకు కొనసాగనుంది. తొలి రోజే చాలా మంది సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఫేమస్ పాప్ సింగర్ రిహాన్నా షో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. రిహాన్నాతో ‘దేవర’ హీరోయిన్ జాన్వీ కపూర్ డాన్స్​ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఓ హిందీ పాటకు నటించి అలరించారు. అయితే అంతా సందడిగా సాగిపోతున్న సమయంలో అనంత్ అంబానీ ఇచ్చిన స్పీచ్​తో ముకేశ్ ఎమోషనల్ అయ్యారు.

అనంత్ అంబానీ ఇచ్చిన ప్రసంగం వేడుకలో పాల్గొన్న అందర్నీ భావోద్వేగానికి గురిచేసింది. ఆ టైమ్​లో ముకేశ్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘నా కుటుంబం నన్ను చాలా ప్రత్యేకంగా చూసింది. అయినా నా లైఫ్ ఏమీ పూలపాన్పు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డా. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నా. జీవితం మొత్తం అడుగడుగునా కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా అమ్మానాన్న నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు. నేను బాధపడకుండా ఏమేం చేయాలో అవన్నీ చేశారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుందంటే అందుకు మా అమ్మే కారణం. ఆమె కొన్ని నెలలుగా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంది. అమ్మ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆమెకు థాంక్స్’ అని అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు.

లైఫ్​లో తాను ఆరోగ్య సమస్యలతో సతమతమైన సమయంలో అమ్మానాన్నలు అండగా నిలిచారని అనంత్ అంబానీ పేర్కొన్నారు. రాధిక తన భార్యగా రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రీ వెడ్డింగ్ సెర్మనీలో అనంత్ ప్రసంగిస్తున్న సమయంలో ముకేశ్ అంబానీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. కొడుకు స్పీచ్​కు ముకేశ్ ఏడ్చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. అనంత్​కు ఆయన పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ సూపర్ అని అంటున్నారు. పేద, ధనిక అనే తేడాల్లేదని అందరి జీవితాల్లోనూ కష్టాలు ఉంటాయని.. ఆ టైమ్​లో మన అనుకునే వాళ్లు అండగా ఉంటే వాటిని ఈజీగా దాటేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అనంత్ స్పీచ్ మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇంకా ఆగని హనుమాన్ బిజినెస్! ఇప్పుడు విదేశాల్లో రిలీజ్!

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş