iDreamPost

అనంత్‌ అంబానీ పెళ్లి వేళ.. పెద్ద సంఖ్యలో ఆలయాలు నిర్మిస్తోన్న అంబానీ కుటుంబం

  • Published Feb 27, 2024 | 11:53 AMUpdated Feb 27, 2024 | 11:53 AM

Anant Ambani: అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ లా వివాహానికి ముందే.. ముఖేష్ అంబానీ కుటుంబం సుమారు పద్నాలుగు ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

Anant Ambani: అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ లా వివాహానికి ముందే.. ముఖేష్ అంబానీ కుటుంబం సుమారు పద్నాలుగు ఆలయాల నిర్మాణాలను చేపట్టింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

  • Published Feb 27, 2024 | 11:53 AMUpdated Feb 27, 2024 | 11:53 AM
అనంత్‌ అంబానీ పెళ్లి వేళ.. పెద్ద సంఖ్యలో ఆలయాలు నిర్మిస్తోన్న అంబానీ కుటుంబం

దేశంలో అత్యంత సంపన్నులైన కుటుంబాలలో ముఖేష్ అంబాని కుటుంబం ఒకటి. ఇప్పటికే ఈ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలు ఎన్నో విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఇంకా అభివృద్ధిలోకి వస్తున్న ప్రాజెక్ట్స్ మరెన్నో ఉన్నాయి. ముఖ్యంగా ముఖేష్ అంబానీ వ్యాపారాలు గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్నాయి. వీటిలో క్రూడ్ ఆయిల్ రిఫైనరీ , గ్రీన్ ఎనర్జీ పార్క్ ఇప్పటికీ అభివృద్ధిలో ఉన్నాయి. ఇక ప్రస్తుతం అంబానీ కుటుంబం అక్కడ ఓ ఆధ్యాత్మిక ప్రాజెక్ట్ ను చేపడుతున్నారు. అటు పారిశ్రామిక వ్యాపారులకే కాకుండా.. ఇటు ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడా అంబానీ ఫ్యామిలి పెద్ద పీఠ వేయనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

అయితే, అనంత్ అంబానీ-రాధిక ల వివాహానికి ముందే.. సుమారు పద్నాలుగు దేవాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. ఇండియాలో లో అతి పెద్ద ఆలయంగా పేరు తెచ్చుకుంటున్న రామ మందిరం , అమెరికాలో బాప్స్ టెంపుల్.. ఎలా అయితే ప్రసిద్ధి చెందాయో.. అదే తరహాలో అంబానీ ఫ్యామిలీ కట్టించబోయే ఆలయాలు కూడా అభివృద్ధిలోకి రానున్నాయి. అంతేకాకుండా .. ప్రప్రాంచవ్యాప్తంగా ఉన్న అంబానీ ఫ్యామిలీ కి సంబంధించిన వారి ఇళ్లలో కూడా .. పూజ గదులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా ముంబై , లండన్ లలో ఉండే ఇళ్లలో చిన్న గుడి కూడా ఉంటుంది. ఇక ప్రస్తుతం గుజరాత్ లోని అంబానీ కుటుంబానికి .. కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన జామ్ నగర్ లో 14 ఆలయాల నిర్మాణంతో సరికొత్త ఆధ్యాత్మిక శోభను తీసుకురానున్నారు.

కాగా, ఈ ప్రాజెక్ట్ ను నీతా అంబానీ చేపట్టనున్నారు. నిర్మాణంలో ఉన్న ప్రతి ఆలయం కూడా.. తరతరాల నాటి ఆధ్యాత్మిక .. కళాత్మక సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా .. విభిన్నమైన దేవతల శిల్పాలతో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల ఈ కట్టడాలను సందర్శించడానికి వచ్చిన నీతా అంబానీ.. అక్కడి కళాకారులతో , భక్తులతో స్నేహ పూర్వకంగా మాట్లాడుతూ .. కళాకారులను ప్రశంసించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దానికి సంబంధించిందే. ఈ వీడియోను ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ .. త్వరలోనే వారి ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరుపుకొన్నారు. మరి, ప్రస్తుతం అంబానీ ఫ్యామిలి నిర్మిస్తున్న ఆలయాలకు సంబంధిచిన వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి