iDreamPost

ఎంత మంచి ప్రభుత్వం.. ట్రాఫిక్‌ సిబ్బందికి AC హెల్మెట్లు.. దేశంలోనే తొలిసారి

  • Published Apr 20, 2024 | 10:10 AMUpdated Apr 20, 2024 | 10:10 AM

మండుటెండల్లో విధులు నిర్వహిస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఏసీ హెల్మెట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటున్నారు. ఆ వివరాలు..

మండుటెండల్లో విధులు నిర్వహిస్తూ.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సిబ్బందికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఏసీ హెల్మెట్లు అందించేందుకు ముందుకు వచ్చింది. దేశంలోనే తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Apr 20, 2024 | 10:10 AMUpdated Apr 20, 2024 | 10:10 AM
ఎంత మంచి ప్రభుత్వం.. ట్రాఫిక్‌ సిబ్బందికి AC హెల్మెట్లు.. దేశంలోనే తొలిసారి

ఎండలు బాబోయ్‌.. ఎండలు అని జనాలు అల్లాడిపోతున్నారు. అత్యధిక వేడి సంవత్సరంగా 2024 రికార్డులోకెక్కింది. మార్చి నుంచే భానుడు తన ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వాటికి తోడు వడగాలులు కూడా వీస్తుండటంతో.. జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత బయట కాలు పెట్టే పరిస్థితి లేదు. ప్రజలు, ఉద్యోగులు అంటే.. ఇంట్లో, ఆఫీసుల్లో కూర్చుని ఉంటారు. కాసేపు వేడి భరిస్తే చాలు.

కానీ ట్రాఫిక్‌ సిబ్బంది డ్యూటీ అలా కాదు. ఎండా, వానా లేక్క చేయకుండా.. గంటల తరబడి రోడ్ల మీదనే విధులు నిర్వహించాలి. ఇక మండే ఎండల్లో వారు అనుభవించే నరకం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ క్రమంలో ట్రాఫిక్‌ సిబ్బంది సమస్యలపై సానుకూలంగా స్పందించిన సర్కార్‌ వారికి ఏసీ హెల్మెట్లు పంపిణీ చేయనుంది. ఇలా చేయడం దేశంలో ఇదే మొదటి సారి. ఇంతకు ఏ ప్రభుత్వం ఇంత మంచి నిర్ణయం తీసుకుంది అంటే..

మండే ఎండల్లో.. తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటూ.. విధులు నిర్వహిస్తోన్న ట్రాఫిక్‌ సిబ్బందికి గుజరాత్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ఏసీ హెల్మెట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. వేసవి తాపం నుంచి తప్పించుకునేందుకు వడోదర ట్రాఫిక్ పోలీసులు ఈ పరిష్కారాన్ని కనిపెట్టారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో గుజరాత్‌ పోలీస్‌ శాఖ.. తన సిబ్బందికి ఏసీతో కూడిన ప్రత్యేక హెల్మెట్‌లను అందజేస్తోంది. ఈ కొత్త ఏసీ హెల్మెట్‌లు 40-42 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతల సమయంలో కూడా కూల్‌గా ఉండేలా చూస్తాయని చెబుతున్నారు. ఈ హెల్మెట్‌ తయారీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి ఎండ వేడిమి నుంచి కళ్లు, తలను కాపాడుకునేందుకు సాయం చేస్తాయి.

ఈ హెల్మెట్‌కు ఛార్జింగ్‌ పాయింట్‌ కూడా ఉంది. దీని ద్వారా వారు ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ హెల్మెట్‌ను పూర్తి స్థాయిలో ఛార్జింగ్‌ పెడితే.. సుమారు ఎనిమిది గంటల వరకు చల్లగా ఉంచగలదని అధికారులు అంటున్నారు. మండుతున్న ఎండల కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిబ్బంది స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. సిబ్బందికి ఏసీ హెల్మెట్‌లను ఇవ్వడానికి రెడీ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఏసీ హెల్మెట్‌లు ధరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రజలు, ట్రాఫిక్‌ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి