iDreamPost

పవన్‌పై తీవ్ర అసంతృప్తిలో ముద్రగడ పద్మనాభం!

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదు. రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల జనసేనలో చేరుతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పవన్ పై తీవ్ర అంసతృప్తిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గురించి ప్రత్యేకంగా చెప్పర్లేదు. రాజకీయాల్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఇటీవల జనసేనలో చేరుతారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా పవన్ పై తీవ్ర అంసతృప్తిలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది.

పవన్‌పై తీవ్ర అసంతృప్తిలో ముద్రగడ పద్మనాభం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు ఏ నేతల ఎలా వ్యవహరిస్తారో అర్థంకాని పరిస్థితి. ఇదే సమయంలో పొలిటికల్ పై వచ్చే వార్తలకు కొదవే లేదు. వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉండగా, మరికొన్ని అవాస్తవాలు ఉంటాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన పొత్తులో సీట్ల పంపకాల విషయంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లో ఏది ఇప్పటి వరకు కన్ఫామ్ కాలేదు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం గురించి ఓ వార్త పొలిటికల్ సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ముద్రగడ్డ పద్మనాభం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర అంసతృప్తితో ఉన్నారనే ప్రశ్నలకు అవునునే సమాధానాలు వినిపిస్తోన్నాయి.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ వ్యవహార శైలిపై ముద్రగడ పద్మనాభం తొలి నుంచి  అసంతృప్తిగానే ఉన్నారనేది చాలా మంది అభిప్రాయం. అయితే కాపులకు రాజ్యాధికారం  దక్కాలనే అక్రమంలో పవన్ కల్యాణ్ ఆశాదీపంగా కనిపిస్తున్నాడని, ఆ సామాజిక వర్గం పదే పదే ఆయన చెవిలో ఊదరగొడుతోంది. దీంతో పవన్ పై ఉన్న అసంతృప్తిని  ముద్రగడ పక్కన పెట్టేశారు. జనసేనలోకి రావాలని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేత బొలిశెట్టి శ్రీనివాస్ గతంలో ముద్రగడ ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.

ఇందుకు పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులు సానకూలత వ్యక్తం చేశారు. అలానే జనసేన తరపున పద్మనాభం కుటుంబం కాకినాడ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తోన్నాయి. అలానే పవన్ కల్యాణ్ స్వయంగా ముద్రగడ ఇంటికెళ్లి పార్టీలోకి చేర్చుకుంటారని బొలిశెట్టి మీడియా ముందు చెప్పారు. ఇలా శ్రీనివాస్ చెప్పిన సమయంలో కూడా దాటి చాలా రోజులు లైంది. అయినా ఇంత వ‌ర‌కూ ముద్ర‌గ‌డ ఇంటివైపు ప‌వ‌న్ చూడలేదు. ముద్ర‌గ‌డ‌ను చేర్చుకోవ‌డంపై టీడీపీ అభ్యంత‌రం చెప్పింద‌నే, అందుకే పవన్ ముద్రగడ ఇంటికి వెళ్లేందుకు ఆలోచిస్తున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో తాజాగా త‌న సన్నిహితుల వ‌ద్ద ముద్ర‌గ‌డ కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ని స‌మాచారం. త‌న ఇంటికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌స్తే ఒక న‌మ‌స్కారం, లేదంటే రెండు న‌మ‌స్కారాలు చేస్తాన‌ని వ్యంగ్యంగా అన్నార‌ని టాక్ వినిపిస్తోంది. విభేదాల‌న్నీ ప‌క్క‌న పెట్టి, జ‌న‌సేన‌లో చేరేందుకు ఆస‌క్తి చూపిన త‌ర్వాత అవ‌మానించే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ముద్ర‌గ‌డ అనుచ‌రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ప‌వ‌న్‌ను న‌మ్ముకుని, టికెట్ ఇస్తామ‌న్న జ‌గ‌న్ పార్టీని అవ‌మానించామ‌నే అంత‌ర్మ‌థ‌నం ముద్ర‌గ‌డ అభిమానుల్లో మొద‌లైదనే టాక్ వినిపిస్తోంది.

కాపు ఉద్య‌మ నాయ‌కుడికి ముద్రగడకు మ‌ర్యాద ఇవ్వ‌క‌పోగా, ఇలా అవ‌మానించ‌డానికైనా పవన్ కల్యాణ్ త‌న పార్టీ నేత‌ల్ని ఇంటికి పంపి, మీడియా ముందు పెద్ద‌పెద్ద డబ్బా మాటలను మాట్లాడించారని ముద్ర‌గ‌డ అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అసంతృప్తి ఉన్నారని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి