iDreamPost

వీడియో: పైకప్పు ఊడినా.. రయ్..రయ్ మంటూ వెళ్లిన RTC బస్సు!

వీడియో: పైకప్పు ఊడినా.. రయ్..రయ్ మంటూ వెళ్లిన RTC బస్సు!

ఆర్టీసీ బస్సు అంటే చాలా మంది సామాన్యులకు.. తమ సొంత వాహనం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే.. సురక్షితంగా, క్షేమంగా మన గమ్యస్థానాలకు ఆర్టీసీ బస్సులు చేరుస్తాయి. అలానే రాత్రివేళ ఆర్టీసీ బస్సులు మాత్రమే తమకు సురక్షితంగా ఉంటాయని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. ఇలానే ఆర్టీసీపై పొగడ్తలతో పాటు విమర్శలు ఉంటాయి. ఆర్టీసీ బస్సులు కాలం చెల్లినవని, అవి ఎక్కడంటే అక్కడే ఆగిపోతాయని చాలా మంది చెప్తుంటారు.  అలాంటి ఘటనలు కూడా మనం చాలానే చూశాం. అయితే తాజాగా ఓ ఆర్టీసీ బస్సు.. పైకప్పు ఊడినా.. రయ్..రయ్ మంటూ రోడ్డుపై దూసుకెళ్లింది. ప్రస్తుతం ఈ పైకప్పు ఊడిన ఆర్టీసీ బస్సుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఓ బస్సు పైకప్పు ఊడిపోయింది. అయినా   ఆ బస్సు ఆగకుండా రోడ్డుపై  ప్రయాణిస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది.  దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.  ఆ బస్సు పైకప్పు ఒక వైపు పూర్తి ఊడి పోయింది. ఈ క్రమంలో బస్సు ఆగకుండా ప్రయాణిస్తుండటంతో ఆ  పైకప్పు గాలికి బలంగా ఊగింది. దీనికి సంబంధించిన వీడియో  మహారాష్ట్ర ఆర్టీసీ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారు వెంటనే స్పందించి.. విచారణకు ఆదేశించారు.

ఈ క్రమంలో ఈ  బస్సు గడ్చిరోలి జిల్లా అహేరి డిపోకు చెందినది గా గుర్తించారు. ఈ ఘటనపై ఎమ్ఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. పైకప్పు ఊడిన.. ఆగకుండా నడిచిన బస్సు  ఘటన తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాక ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఈ ఘటనపై అహేరి డిపో అధికారులు కూడా స్పందించారు.

వారు మాట్లాడుతూ..” బస్సు పైభాగం మొత్తం ఊడిపోలేదు. కేవలం ముందుభాగంలో ఉన్న ఫైబర్ మాత్రమే ఊడిపోయింది. ఈ విషయం ప్రయాణికలతో సహా డ్రైవర్ కూడా తెలియదు. పక్కనే వస్తున్న వాహనదారులు చెప్పడంతో.. అధికారులకు చూపించాలని బస్సు సిబ్బందే వీడియో తీయాలని సూచించినట్లసు విచారణలో  వెల్లడైంది” అని వారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరి సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరి.. వైరల్ అవుతోన్న ఈ వీడియోను మీరు  వీక్షించి..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: క్రేన్‌కు అంటుకున్న మంటలు.. 45 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి