iDreamPost

వీడియో: క్రేన్‌కు అంటుకున్న మంటలు.. 45 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి..

వీడియో: క్రేన్‌కు అంటుకున్న మంటలు.. 45 అంతస్తుల బిల్డింగ్‌పైనుంచి..

న్యూయార్క్‌ నగరంలో ఓ భారీ క్రేన్‌ ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగటంతో.. అది ఒక్కసారిగా విరిగి కిందపడింది. దాదాపు 45 అంతస్తులపై నుంచి ఆ క్రేన్‌ కిందపడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కానీ, దాదాపు 6 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. అమెరికా, న్యూయార్క్‌ సిటీలోని టెన్త్‌ ఎవెన్యూ.. హెల్స్‌ కిచెన్‌ సమీపంలో ఓ భారీ భవనానికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

బుధవారం ఉదయం 2 గంటల ప్రాంతంలో భవనం 45వ అంతస్తులో ఓ క్రేన్‌ పనిచేస్తూ ఉంది. కాంక్రీట్‌ను ఎత్తి పైకి తెస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే 16 టన్నుల కాంక్రీట్‌ను ఒకేసారి పైకి లేపుతూ ఉంది. బరువు ఎక్కువవటంతో క్రేన్‌ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో క్రేన్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. విరిగిన భాగం పెద్ద శబ్ధం చేస్తూ కింద పడింది. ఆ పడటం కూడా పక్కన ఉన్న బిల్డింగ్‌ అద్దాలను ధ్వంసం చేస్తూ కిందపడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరక్కపోయినప్పటికి.. ఆరుగురి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది 45 అంతస్తుపైకి చేరుకుని మంటల్ని ఆర్పేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఆ సమయంలో కింద ఎవరైనా ఉండి ఉంటే ప్రాణాలు పోయేవి’’.. ‘‘ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి’’.. ‘‘ అదృష్టం బాగుంది లేదంటే.. పెద్ద ప్రాణ నష్టమే జరిగేది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన క్రేన్‌ ప్రమాద వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి