iDreamPost

ఖరీఫ్ కి మద్దతు ధరలు స్వల్పంగా పెంచనున్న కేంద్రం?.

ఖరీఫ్ కి మద్దతు ధరలు స్వల్పంగా పెంచనున్న కేంద్రం?.

రాబోయే ఖరీఫ్ సీజన్ పంటలకుగాను 17 రకాల పంటలకు మద్దతు ధరలను(MSP- minimum selling price) పెంచాలని CACP (Commission for Agricultural Costs and prises) కేంద్ర ప్రభుత్వానికి సిఫారస్ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి . సాధారణంగా సీఏసీపీ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వాలు యధాతధంగా ఆమోదిస్తాయి కాబట్టి కేంద్ర మంత్రి వర్గ ఆమోదం పొందడం లాంఛనమే అని చెప్పొచ్చు.

అయితే ఈ పెంచనున్న రేట్లు ఏ విధంగా ఉన్నాయి అన్నది గమనిస్తే అంత ఆశాజనకం కాదనే చెప్పొచ్చు . ప్రధానమైన వరి (ప్యాడీ) పంటకు గతంలో గ్రేడ్ 1 క్వింటాకు 1835 ₹ , సాధారణ రకాలు 1815 ₹ లు మద్దతు ధర కాగా ప్రస్తుత సిఫార్సు ప్రకారం 53 ₹ పెంచి గ్రేడ్ 1 కి 1888 ₹ , సాధారణ రకాలకు 1868 ₹ గా నిర్ణయించారని సమాచారం .

అయితే పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని క్వింటాకు 2000 ₹ నుండి 2200 ₹ వరకూ మద్దతు ధరగా నిర్ణయించాలని వివిధ రాష్ట్రాల వ్యవసాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం యధావిధిగా కంటితుడుపు చర్యగా స్వల్పంగా పెంచబోతుండడం వరి రైతుల్ని నిరాశకు గురి చేయొచ్చు .

కాగా ఆహార నూనెల దిగుమతుల భారం తగ్గించుకోవటానికి వీలుగా నూనె గింజలకు మద్దతు ధరలు భారీగా పెంచనుందని సమాచారం . మిగతా పంటల ఖచ్చితమైన మద్దతు ధర ఇంకా పూర్తిగా తెలియకపోయినా నూనె గింజల ధరలు మాత్రం రైతులకు ఆశాజనకంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు వ్యాఖ్యానించారు . 

దీన్ని బట్టి మన రాష్ట్ర పరంగా చూస్తే వేరుశనగ పంట ఎక్కువగా పండించే రాయలసీమ రైతులకు కొంత ఊరట లభిస్తుందని చెప్పొచ్చు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి