iDreamPost

డిసెంబర్ 9 – మరీ ఇన్ని సినిమాలా?

డిసెంబర్ 9 – మరీ ఇన్ని సినిమాలా?

మాములుగా ప్రతి శుక్రవారం మూడు నాలుగు కొత్త రిలీజులు వస్తేనే మూవీ లవర్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అంచనాలు లేనివి లైట్ తీసుకుని మిగిలినవాటికి థియేటర్లకొస్తారు. కానీ ఏకంగా 15 సినిమాలు బాక్సాఫీస్ మీదకు కలబడితే దాన్నేమనాలి. డిసెంబర్ 9 దీనికి వేదిక కాబోతోంది. అవేంటో చూద్దాం. గాడ్ ఫాదర్ తో యాక్టర్ గా తన స్థాయిని పెంచుకున్న సత్యదేవ్ మొదటిసారి తమన్నాతో జట్టు కట్టిన ‘గుర్తుందా శీతాకాలం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే చాలా వాయిదాల తర్వాత ఫైనల్ గా ఇప్పటికి కుదిరింది. విశ్వక్ సేన్ ప్రత్యేక పాత్ర పోషించిన ‘ముఖచిత్రం’ ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో డిఫరెంట్ గా కనిపిస్తోంది. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రచన చేశారు

కర్ణాటకలో సుప్రసిద్ధ విఆర్ఎల్ ట్రాన్స్ పోర్ట్ యజమాని జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘విజయానంద్’ని తెలుగులోనూ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. మనకు అంతగా పరిచయం లేని వ్యక్తి కాబట్టి బజ్ లేదు కానీ ఒకవేళ టాక్ బాగా వస్తే పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బ్రహ్మ్మనందం, స్వాతి రెడ్డి, సముతిరఖని, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య తదితరులు కీలక పాత్ర పోషించిన ‘పంచతంత్రం’ ట్రైలర్ ఆకట్టుకుంది కానీ ప్రస్తుతానికి ఆడియన్స్ దృష్టిలో ఇంకా పడలేదు. ఇవి కాకుండా లెహరాయి, చెప్పాలని ఉంది, రాజయోగం, ఏపీ04 రామాపురం, నమస్తే సేట్ జీ మేమూ వస్తామంటూ ఉత్సాహపడుతున్నాయి. అసలివి ఎప్పుడు తీశారో కూడా గుర్తుపట్టలేం.

పైవి కాసేపు పక్కనపెడితే డబ్బింగ్ చిత్రాలు మరోవైపు. రామ్ గోపాల్ వర్మ మా ఇష్టం, పునీత్ రాజ్ కుమార్ సివిల్ ఇంజనీర్, అరుణ్ విజయ్ ఆక్రోశం, కన్నడ నుంచి తెచ్చిన ఐ లవ్ యు మై ఇడియట్, డాక్టర్ 56లు క్యూ కట్టాయి. ఇవేవీ వద్దు అనుకుంటే హ్యాపీగా కలర్ మాయాబజార్ ని థియేటర్లో ఆస్వాదించవచ్చు. మంచి డాల్బీ సౌండ్ ఉన్న స్క్రీన్ ని ఎంచుకుంటే చాలు. 1996 యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ ప్రేమదేశంని సైతం ఇదే తేదీకి రీ రిలీజ్ చేస్తున్నారు. ఇన్ని ఆప్షన్లు పైకి కనిపిస్తున్నాయి కానీ టాక్ బాగా వస్తే కానీ జనాన్ని ఆకట్టుకోలేని బజ్ తో దిగుతున్నాయి. ఎవరికి వారు ప్రమోషన్లు చేస్తున్నా మరీ పదిహేను సినిమాలంటే ఆడియన్స్ అయోమయం పడరా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి