iDreamPost

panchatantram movie పంచతంత్రం రిపోర్ట్

panchatantram movie పంచతంత్రం రిపోర్ట్

ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలు స్మార్ట్ ఫోన్లలో మునిగితేలుతున్నారు కానీ ఇవేవి లేని రోజుల్లో బాల్యమంతా ఎన్నో అందమైన కథలతో గడిచిపోయేది. మరీ ముఖ్యంగా పంచతంత్ర కథలు పెద్దలు చెబుతుంటే వయసుతో సంబంధం లేకుండా అందరూ చెవులు రిక్కించి వినేవాళ్ళు. ఎన్నో టీవీ సీరియల్స్ రూపొంది మంచి విజయం సాధించాయి. దాన్నే టైటిల్ గా పెట్టుకుని ఇవాళో సినిమా థియేటర్లలో అడుగుపెట్టింది. హర్ష పులిపాక దర్శకత్వంలో అయిదు కథల సమాహారంగా రూపొందిన మల్టీ స్టోరీ కాన్సెప్ట్ ఇది. మంచి క్వాలిటీ కాస్టింగ్ తీసుకోవడంతో దీని మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి దానికి తగ్గట్టు ఈ మూవీ ఉందా రిపోర్ట్ లో చూద్దాం

పంచేంద్రియాలను ఆధారంగా చేసుకుని స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీలో ఒక్కోదాని మీద ఒక్కో కథ చెప్పే రిటైర్డ్ రేడియో ఉద్యోగి వేదవ్యాస్ మాటల్లో ఇది సాగుతుంది. పనిఒత్తిడి కారణంగా సతమతమయ్యే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి, తన అభిరుచులకు తగ్గ అమ్మాయి కోసం వెతికే ఒక యువకుడు, నెలలు నిండిన కూతురి విషయంలో ఓ సమస్య ఏర్పడ్డ బ్యాంక్ ఎంప్లాయ్, క్యాన్సర్ సోకిన గర్భవతి భార్య విషయంలో ఆ జంట తీసుకునే నిర్ణయం, చిన్నపిల్లలకు ఆకట్టుకునేలా కథలు చెప్పే ఓ అమ్మాయి జీవితంలో ప్రవేశించిన పాప ఇలా మొత్తం అయిదు ప్లాట్లు తీసుకున్న వేదవ్యాస్ కాంపిటీషన్ లో గెలిచేలా వాటిని హత్తుకునేలా చెబుతాడు. అవెలా అనేదే తెరమీద చూడాలి.

దర్శకుడు హర్షలో మంచి పొయెటిక్ సెన్స్ ఉంది. అందుకే సాధారణంగా ఎవరూ తీసుకోని పంచేంద్రియాలతో ఈ సబ్జెక్టు రాసుకున్నాడు. టేకింగ్ విషయంలో మెప్పించినప్పటికీ అన్ని కథలను ఒకే టెంపోలో నడిపించడంలో తడబడ్డాడు. ఫలితంగా ఓ రెండు కథలు మరీ నెమ్మదిగా సాగి ఆశించిన స్థాయిలో అనిపించవు. బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, సముతిరఖని, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య ఇలా సీనియర్ నుంచి జూనియర్స్ దాకా టాలెంటెడ్ క్రూని సెట్ చేసుకోవడం పంచతంత్రంని మరీ నెగటివ్ కాకుండా కాపాడింది. ఎక్కువ ఎంటర్ టైన్మెంట్, కమర్షియల్ అంశాలు ఆశించకుండా ఉంటేనే ఓ మోస్తరుగా నచ్చే ఈ సింపుల్ సిరీస్ రెగ్యులర్ ఆడియన్స్ కి మాత్రం అంతగా సూట్ అవ్వకపోవచ్చు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి