iDreamPost

OTTలోకి దూసుకెళ్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? మిస్ కాకండి!

  • Published Jan 04, 2024 | 3:54 PMUpdated Mar 14, 2024 | 4:55 PM

ప్రస్తుతం ఓటీటీ లో విడుదలైన ప్రతి వెబ్ సిరీస్ భాషతో సంబంధం లేకుండా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. ఆడియన్సు కూడా వీటిని అంతే రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో బాగా ఫేమస్ అయిన ఓ స్పానిష్ వెబ్ సిరీస్ లోని క్యారక్టర్ తో.. తాజాగా మరో వెబ్ సిరీస్ విడుదల చేశారు.

ప్రస్తుతం ఓటీటీ లో విడుదలైన ప్రతి వెబ్ సిరీస్ భాషతో సంబంధం లేకుండా మంచి పాపులారిటీని సంపాదించుకుంటున్నాయి. ఆడియన్సు కూడా వీటిని అంతే రేంజ్ లో ఆదరిస్తున్నారు. ఈ క్రమంలో బాగా ఫేమస్ అయిన ఓ స్పానిష్ వెబ్ సిరీస్ లోని క్యారక్టర్ తో.. తాజాగా మరో వెబ్ సిరీస్ విడుదల చేశారు.

  • Published Jan 04, 2024 | 3:54 PMUpdated Mar 14, 2024 | 4:55 PM
OTTలోకి దూసుకెళ్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా? మిస్ కాకండి!

ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ విషయంలో ఓటీటీదే పై చేయి. ముఖ్యంగా యువత ఓటీటీలలో విడుదలైన ప్రతి సిరీస్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాల విషయం పక్కన పెడితే.. ఇందులో విదులయ్యే వెబ్ సిరీస్ లకే ఎక్కువ ఆదరణ లభిస్తుందని చెప్పి తీరాలి. దీనితో ప్రముఖ నటీ నటులు కూడా ఓటీటీ లో వెబ్ సిరీస్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇక వెబ్ సిరీస్ అనగానే ముందు ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యేది ‘మనీ హెయిస్ట్‌’ . ఈ సిరీస్ మొత్తంగా ఐదు సీజన్స్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. ఐదు సీజన్స్ లోను ప్రతి ఎపిసోడ్ ఆడియన్సుకు ఇంట్రెస్ట్ కలిగించేలా తీశారు. అయితే, అందులో బాగా ఫేమస్ అయిన ఓ క్యారక్టర్ బెర్లిన్ . ఇక ఇప్పుడు తాజాగా, ఈ క్యారక్టర్ పేరుతో ప్రత్యేకంగా ‘బెర్లిన్’ అనే వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు.

మనీ హెయిస్ట్‌ వెబ్ సిరీస్ అన్ని భాషలలోను ఆడియన్సును ఆకట్టుకుంది. ఇది ఒక క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా సూపర్ హిట్ సాధించింది. ఇందులోనూ కొన్ని క్యారెక్టర్లకు ప్రత్యేకమైన అభిమానులు కూడా ఉన్నారు. ఇటు తెలుగులోను ఈ సిరీస్ ను చాలా మంది ఇష్టపడ్డారు.
మనీ హెయిస్ట్‌ సిరీస్ లో బ్యాంక్ దోపిడీ వెనుక రెండు మాస్టర్ మైండ్స్ ఉంటాయి. వారిలో ఒకడు బెర్లిన్. అసలు బెర్లిన్ మనీ హెయిస్ట్‌ కంటే ముందు ఏం చేసేవాడు అనే కథాంశంతో ఈ సిరీస్ ను రూపొందించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మనీ హెయిస్ట్‌ చూసిన అభిమానులకు బెర్లిన్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అయిన కొన్ని రోజులకే బెర్లిన్ కు మంచి రెస్పాన్స్ లభించింది.

కాగా, ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. సుమారు ఏడు గంటల పాటు ఇది కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో ఆక్షన్ హౌస్ లో ఉన్న విలువైన వస్తువులను ఎలా దొంగిలిస్తారు. అనే పాయింట్ ను చూపిస్తారు. ఆ ఆక్షన్ హౌస్ లో దాదాపు 44 మిలియన్ యూరోల విలువైన ఆభరణాలు ఉంటాయి. దానిని కాజేసేందుకు బెర్లిన్ ఎలా ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్ అమలు పరచడంలో ఎవరి సలహా తీసుకుంటాడు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురౌతాయి. వాటిని ఎదుర్కొని ఎలా ముందుకు సాగుతారు. ఇలా కొన్ని ఎపిసోడ్స్ రూపంలో ఉత్కంఠ భరితంగా.. ఆడియన్సుకు ఇంట్రెసింగ్ కలిగించే విధంగా.. మనీ హెయిస్ట్‌ ప్రీక్వెల్ బెర్లిన్ స్టోరీని చిత్రీకరించారు.

పైగా బెర్లిన్ వెబ్ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మనీ హెయిస్ట్‌ సిరీస్ లోనే బెర్లిన్ పాత్రలో పెడ్రో అలోన్సో తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బెర్లిన్ సిరీస్ లో మూడు లవ్ స్టోరీలు, ఒక దోపిడీ సన్నివేశాలతో తన నటనతో మరింత క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక సమంత సిక్వోరోస్‌, ట్రిస్టన్‌ ఉల్లోవా, మిచెల్‌ జెన్నర్‌, బెగోనా వర్గాస్‌, జూలియో పెనా ఫెర్నోండోజ్‌, జోయెల్‌ శాంఛెజ్‌ ఇతర పాత్రల్లో కనిపించారు. పూర్తి స్టోరీ తెల్సుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ అవుతున్న బెర్లిన్ సిరీస్ చూడాల్సిందే . మరి, బెర్లిన్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి