iDreamPost

మెగాస్టార్ VS మోహన్ లాల్ – అర్థంలేని ట్రోలింగ్

గతంలో చెప్పినట్టు కొన్ని కీలక మార్పులైతే చేశారు. టోవినో థామస్ కు బదులుగా నయనతార క్యారెక్టర్ నే ఎక్స్ ట్రెండ్ చేసి సెకండ్ హాఫ్ టెంపోని పూర్తిగా మార్చినట్టు కనిపిస్తోంది.

గతంలో చెప్పినట్టు కొన్ని కీలక మార్పులైతే చేశారు. టోవినో థామస్ కు బదులుగా నయనతార క్యారెక్టర్ నే ఎక్స్ ట్రెండ్ చేసి సెకండ్ హాఫ్ టెంపోని పూర్తిగా మార్చినట్టు కనిపిస్తోంది.

మెగాస్టార్ VS మోహన్ లాల్ – అర్థంలేని ట్రోలింగ్

నిన్న అనంతపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ట్రైలర్ చెప్పిన టైంకే కరెక్ట్ గా వదిలేశారు. వీడియో మొత్తం చిరు ఇమేజ్ కు తగ్గట్టు హీరోయిజం ఎలివేషన్లు, రాజకీయాలకు సంబంధించిన పొలిటికల్ డైలాగులు భారీగానే సెట్ చేశారు. గతంలో చెప్పినట్టు కొన్ని కీలక మార్పులైతే చేశారు. టోవినో థామస్ కు బదులుగా నయనతార క్యారెక్టర్ నే ఎక్స్ ట్రెండ్ చేసి సెకండ్ హాఫ్ టెంపోని పూర్తిగా మార్చినట్టు కనిపిస్తోంది. సత్యదేవ్ ఒరిజినల్ వెర్షన్ లోని వివేక్ ఒబెరాయ్ పెర్ఫార్మన్స్ కు ధీటుగా ఇందులో మెప్పించాడని మెగాస్టార్ అతని మీద గుప్పించిన పొగడ్తలను బట్టి చూపించిన సీన్స్ ని బట్టి తెలిసిపోతోంది.
Pointless trolling
ఇదంతా బాగానే ఉంది కానీ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా మోహన్ లాల్ చిరంజీవి అభిమానుల మధ్య అర్థం పర్థం లేకుండా పోలికల యుద్ధం జరుగుతోంది. లాలెట్టన్ రేంజ్ లో ఇంటెన్సిటిని చిరు చూపించలేకపోయారని, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ గుండెల మీద కాలు పెట్టే సన్నివేశాన్ని హైలైట్ చేస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. నిజానికి లూసిఫర్ లో కూడా మోహన్ లాల్ పూర్తిగా తన కాలిని పైకెత్తలేదు. మేకింగ్ విజువల్స్ లో దాన్ని గమనించవచ్చు. వయసు దృష్ట్యా ఇలాంటి సీనియర్ హీరోలతో దర్శకులు పొరపాటున కూడా అలాంటి రిస్క్ లు చేయించరు. తెలుగులోనూ చిరంజీవి బెంచీ మీద ఉన్న సముతిరఖని మీద ఆ జాగ్రత్తలతోనే తక్కువ లెన్త్ తో షూట్ చేశారు.
Megastar VS Mohanlal - senseless trolling (2)
ఎవరికెవరు తీసిపోని ఈ ఇద్దరు లెజెండ్స్ లో ఎవరు గొప్ప అనే ప్రశ్నే అర్థరహితం. చిరంజీవి లాగా మోహన్ లాల్ డ్యాన్సులు చేయలేడు. కొన్ని ఎక్కువ డెప్త్ ఉన్న ఎమోషన్స్ లో మల్లువుడ్ కంప్లీట్ స్టార్ బెటర్ అనిపించవచ్చు. అంతే తప్ప ఫలానా వాళ్ళే గొప్ప అని చెప్పుకోవడం మూర్ఖత్వం. ఇలాంటి ఫ్యాన్ వార్ కొత్తేమీ కాదు కానీ ఇలా పరభాష స్టార్లతో కొట్టేసుకోవడమే కరెక్ట్ కాదు. ఏ కాలంలో అయినా రీమేక్ లకు వచ్చే సమస్య పోలికే. దాన్ని మరీ ఓవర్ పర్సనల్ గా చూస్తే నెగటివ్సే ఎక్కువ కనిపిస్తాయి. ఒరిజినల్ కంటే బెటర్ గా రూపొందిన ఘరానా మొగుడు, చంటి, పెదరాయుడు, గబ్బర్ సింగ్, ఠాగూర్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్స్ ని మర్చిపోతే ఎలా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి