iDreamPost

మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘నెరు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

Neru OTT Release Date: ఇటీవల ఓటీటీ లో వారం వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీకే జై కొడుతున్నారు.

Neru OTT Release Date: ఇటీవల ఓటీటీ లో వారం వారం ఎన్నో కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు చాలా వరకు ఓటీటీకే జై కొడుతున్నారు.

మోహన్‌లాల్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘నెరు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!

ప్రస్తుతం ఓటీటీ జమానా నడుస్తుంది.. వారం వారం కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ తో సందడి చేస్తుంది. ఒకప్పుడు ధియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు ఎప్పుడో టీవీల్లోకి వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. రిలీజ్ అయిన కొత్త సినిమాలు ఒక్క నెలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. భారతీయ చిత్రాలే కాదు.. విదేశీ చిత్రాలు, వెబ్ సీరీస్ వస్తున్నాయి. కామెడీ, హర్రర్, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్, వెబ్ సీరీస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇటీవల కొంతమంది నిర్మాతలు తమ సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మోహన్ లాల్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘నెరు’ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో వివరాలు తెలుసుకుందాం.

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ జాతీయ నటుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. తాజాగా మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘నెరు’ మూవి డిసెంబర్ 21, 2023 రిలీజ్ అయ్యింది. అదే సమయానికి సలార్, డంకీ మూవీస్ కూడా రిలీజ్ అయినప్పటికీ ‘నెరు’ మంచి సక్సెస్ సాధించింది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ మూవీ జనవరి 23 ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మాలీవుడ్ లో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు చేసింది. కేరళాలో రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తెచ్చుకొని రూ.47 కోట్లు వసూళ్లు చేసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.86 కోట్లకు పైగా రాబట్టింది. అయితే ఈ మూవీ ఇతర డబ్బింగ్ వర్షన్స్ లో అందుబాటులో ఉంటుందా లేదా అన్న విషయంపై సమాచారం లేదు. ప్రస్తుతం మలయాళంలోనే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తో పాటు ప్రియమణి, అనశ్వరి రంజన్ కీలక పాత్రల్లో నటించారు. ఆశీర్వాద్ సినిమాల్ బ్యానర్ పై శాంతి ఆంటోనీ, ఆంటోనీ పెరంబపూర్ నిర్మించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి