iDreamPost

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట!

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో సుప్రీం కోర్టులో కవితకు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులను సవాలు  చేస్తూ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈనెల 26 వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది. కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించకూడదని పిటిషన్ లో పేర్కొంది. నళినీ చిదంబరం తరహాలోనే తమకూ ఊరట ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టును కోరింది.

ఢిల్లీ  లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని నోటీసులు జారీ చేసింది.  ఎమ్మెల్సీ కవితకు దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. గతంలోనూ ఆమెకు ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజుల పాటు విచారణ కూడా చేసింది. గతేడాది చివర్లో లిక్కర్‌ కుంభకోణం అంశంలోనే సీబీఐ కూడా కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో విచారించింది.

ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం  పోలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈడీ ఇచ్చిన నోటీసులపై కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈనెల 26 వరకు సమన్లు జారీ వద్దని జస్టిస్‌ కౌల్‌ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈడీ విచారణను తప్పు బడుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కవిత వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు  విచారణకు చెపట్టింది. ఈ క్రమంలో  అప్పటి వరకు ఈడీ సమన్లు వర్తించవని సుప్రీంకోర్టు తెలిపింది. 10 రోజుల వరకు సమన్లు వాయిదా వేస్తామని ఈడీ.. సుప్రీం కోర్టుకు తెలిపింది.

తదుపరి విచారణ సెప్టెంబర్ 26కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం జరిగే ఈడీ విచారణకు దూరంగా ఉండాలని నిర్ణయించామని.. ఏం చేయాలనే దానిపై తమ న్యాయ బృందం స్పందిస్తుందని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఈ నోటీసులను తెలంగాణ ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆమె అన్నారు. అయితే బాధ్యత గల ప్రజాప్రతినిధిగా.. ఈ విషయాన్ని తమ లీగల్‌ టీంకు చెప్పామని, వాళ్లు ఇచ్చే సలహాను బట్టి ముందుకు సాగుతామని ఆమె అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి