iDreamPost

ట్రాఫిక్ జామ్‌లో ఎమ్మెల్సీ కవిత.. స్కూటీపై వెళుతున్న వీడియో వైరల్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నెల 30న జరిగే శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీ నామినేషన్లకు చివరి గడువు. ఈ క్రమంలో గురువారం సీఎం కేసీఆర్, కేటీఆర్ నామినేషన్లు దాఖలు చేశారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ నెల 30న జరిగే శాసన సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం తుది దశకు చేరుకుంది. ఈ నెల 10వ తేదీ నామినేషన్లకు చివరి గడువు. ఈ క్రమంలో గురువారం సీఎం కేసీఆర్, కేటీఆర్ నామినేషన్లు దాఖలు చేశారు.

ట్రాఫిక్ జామ్‌లో ఎమ్మెల్సీ కవిత.. స్కూటీపై వెళుతున్న వీడియో వైరల్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మరింత ఊపందుకుంది. ఓ వైపు ప్రచారాల హోరు, మరోవైపు నామినేషన్ల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ఖరారు అయ్యారు. నామినేషన్ల పర్వం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ ప్రక్రియ 10వ తారీఖుతో ముగియనుంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ ప్రధాన నేతలైన సీఎం కేసీఆర్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ నామినేషన్ల దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ రెండు చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్, కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పత్రాలు అందజేశారు.సిరిసిల్లలో నామినేషన్ దాఖలు చేశారు మంత్రి కేటీఆర్.

ఈ క్రమంలో ర్యాలీగా వెళుతుండగా.. ప్రచారం రథంపై నుండి అదుపుతప్పి వాహనంపై పడిపోయారు కేటీఆర్. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ ర్యాలీలో పాల్గొనేందుకు బైక్ పై వెళుతూ వార్తల్లో నిలిచారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గం బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో భాగంగా ర్యాలీని ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు కవిత. ఆ ర్యాలీకి వెళుతుండగా.. ఆమె వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో కవిత ప్రయాణిస్తున్న వాహనం ట్రాఫిక్‌లో చిక్కకుంది. వాహనాలు ఎక్కడికక్కడే స్ట్రక్ అయ్యే సరికి.. సమయం మించిపోతుందని భావించి.. ర్యాలీ ప్రాంతానికి చేరుకునేందుకు స్కూటీపై ప్రయాణించారు.

ర్యాలీ ప్రాంతానికి వెళుతుండగా.. ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే ఒక వ్యక్తి స్కూటీపై వెళ్లారు. అతడు డ్రైవింగ్ చేస్తుండగా.. వెనుక కూర్చొని అభివాదం చేశారు కవిత. ఆమె సామాన్యురాలిలా స్కూటీపై వస్తుంటే.. స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలు కవితయేనా అని ఆశ్యర్యం వ్యక్తం చేయడంతో పాటు అభివాదం చేశారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్నారు కవిత.  షకీల్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె బైక్ పై వెళుతున్న దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. తెలంగాణలో నవంబర్ 30న శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి