iDreamPost

రెండో వైపు చూడొద్దంటున్న బాలయ్య

రెండో వైపు చూడొద్దంటున్న బాలయ్య

‘‘చూడూ ఒక వైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. చచ్చిపోతావ్‌..’’ ఓ సినిమాలో బాలకృష్ణ డైలాగ్‌ ఇది. ఇలాంటి డైలాగ్‌లు బాలయ్య సినిమాలో సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. దానికి ప్రేక్షకుల నుంచి ఆదరణ బాగుంటుంది. అయితే సినిమాల్లోలాగే బాలయ్య రాజకీయాల్లో కూడా ఇలాంటి డైలాగులే వాడుతున్నారు. నిన్న హిందూపురం పర్యటనలో బాలకృష్ణను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నార ంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘనటపై ఈ రోజు బాలయ్య ఫైర్‌ అయ్యారు.

తాను ఒక్క కనుసైగ చేస్తే పరిస్థితి మరోలా ఉంటుందని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హెచ్చరించారు. వాళ్లు (వైఎస్సార్‌సీపీ) 20 మంది వస్తే..తాను కనుసైగ చేస్తే వెయ్యి మంది వచ్చారంటూ సినిమా తరహా డైలాగ్‌లు కొట్టారు. అయితే హింసకు తాను వ్యతిరేకమని వారిని నియంత్రించానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో మాత్రం బాలయ్యను అభినందించవచ్చు. ఇటీవల కాలంలో వచ్చిన బాలయ్య ఏ చిత్రంలోనూ కత్తి వాడని సన్నివేశం లేదు. ప్రతి సినిమాలోనూ బాలయ్య వెరైటీ కత్తిని వాడుతుంటారు. సినిమాల్లో భీభత్సమైన హింసను తన నటనలో చూపించే బాలయ్య వాస్తవ జీవతంలో మాత్రం హింసకు వ్యతిరేకమంటూ చెప్పడం అభినందనీయం.

హిందూపురం నుంచి వరుసగా 2014, 2019 ఎన్నికల్లో బాలయ్య గెలిచారు. అయినా స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం (టీడీపీ) ఉన్నా హిందూపురంలో మంచినీటి సమస్యను తీర్చలేకపోయారు. అప్పట్లో స్థానిక మహిళలు బాలయ్య వద్దకు వచ్చి బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఆయన కారును అడ్డుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోయినా.. హిందూపురం ప్రజలు 2019లో కూడా బాలయ్యను ఎన్నుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పడు కూడా అదే తీరును కొనసాగిస్తున్నారు. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అందరూ అంటుంటే.. బాలయ్య మాత్రం ఒకే రాజధాని ఉండాలంటున్నారు. కర్నూలులో హైకోర్టు రాయలసీమ వాసుల హక్కు. ఈ హక్కునే జగన్‌ కల్పిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధి అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంపై స్థానికులు బాలయ్యపై ఫైర్‌ అవుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి