iDreamPost

 IPL చరిత్రను తిరగరాసిన మిచెల్ స్టార్క్! ఏకంగా రూ.24.75 కోట్లకి!

Mitchell Starc Made Histroy In IPL 2024 Auction: ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ 2024 ఆక్షన్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టిస్తున్నారు.

Mitchell Starc Made Histroy In IPL 2024 Auction: ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ 2024 ఆక్షన్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రికార్డులను సృష్టిస్తున్నారు.

 IPL చరిత్రను తిరగరాసిన మిచెల్ స్టార్క్! ఏకంగా రూ.24.75 కోట్లకి!

దుబాయ్ వేదికగా 2024 ఐపీఎల్ ఎడిషన్ కోసం మినీ వేలం జరుగుతోంది. ఈ మినీవేలం బడా బడా రికార్డులను క్రియేట్ చేస్తోంది. 16 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో ఎప్పుడూలేని అద్భుతాలు ఇప్పుడు నమోదు అవుతున్నాయి. ఒకప్పుడు ఒక ప్లేయర్ కి రూ.15 కోట్లు ఇస్తే అబ్బో అని నోరెళ్లబెట్టారు. కానీ, ఈ వేలంలో ఏకంగా రూ.20 కోట్ల ధరను కూడా దాటేస్తున్నారు. పాట్ కమ్మిన్స్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.20.50 కోట్లకు కొనుగోలు చేయగానే అందరూ అవాక్ అయ్యారు. కానీ అదే ఆస్ట్రేలియా జట్టుకు చెందిన మిచెల్ స్టార్క్ ఇప్పుడు కమ్మిన్స్ రికార్డునే బ్రేక్ చేశాడు.

సాధారణంగా ఐపీఎల్ అనగానే విదేశీ ఆటగాళ్లకు డిమాండ్ బాగా ఉంటుంది. ఫ్రాంచైజీ పర్స్ లో ఎక్కువ మొత్తాన్ని విదేశీ ఆటగాళ్ల కోసమే ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే ఈసారి వేలంలో నమోదవుతున్న రికార్డులు చూస్తుంటే అందరికీ బుర్రలు వేడెక్కిపోతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటేనే ఫ్రాంచైజీలు ఎగబడి కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే ఆస్ట్రేలియాకి చందిన ట్రావిస్ హెడ్ ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.6.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత పాట్ కమ్మిన్స్ ను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ హిస్టరీలోనే తొలిసారి రూ.20 కోట్ల మార్క్ ని క్రాస్ చేశాడు.

అందరూ కమ్మిన్స్ రికార్డు చూసి అందరూ వావ్ అన్నారు. కానీ, ఆ తర్వాత ఆక్షన్ లోకి వచ్చిన మిచెల్ స్టార్క్ అందరినీ మరింత షాక్ కు గురిచేశాడు. ఎందుకంటే పాట్ కమ్మిన్స్ రికార్డును కూడా స్టార్క్ తుడిచిపేట్టేశాడు. ఏకంగా రూ.24.75 కోట్లకు మిచెల్ స్టార్క్ అమ్ముడయ్యాడు. అతడి కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడ్డారు. రూ.9.60 కోట్ల దగ్గర ముంబయి జట్టు, ఢిల్లీ రెండూ తప్పుకున్నాయి. ఆ తర్వాత రేసులోకి గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఈ రెండు జట్లు మిచెల్ స్టార్క్ కోసం పోటీ పడ్డాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించి స్టార్క్ ని దక్కించుకోవాలని చూస్తూ ఆ ధరను కాస్తా రూ.24.75 కోట్లకు చేర్చేశారు.

మిచెల్ స్టార్క్ రీ ఎంట్రీ మరీ ఇంత గ్రాండ్ గా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. 8 ఏళ్ల తర్వాత మిచెల్ స్టార్క్ తిరిగి ఐపీఎల్ కి ఎంట్రీ ఇస్తున్నాడు. రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసమే స్టార్క్ ఐపీఎల్ ఆడేందుకు సిద్ధపడ్డాడు. ఇప్పటివరకు కేవలం రెండే సీజన్స్ లో స్టార్ ఆడాడు. ఆ రెండూ కూడా ఆర్సీబీ తరఫునే ఆడాడు. 2015లో అతని ఆఖరి ఐపీఎల్ ఆడాడు. ఆ తర్వాత 2018లో కోల్ కతా అతడిని కొనుగోలు చేసింది. కానీ, గాయం కారణంగా మిచెల్ స్టార్క్ ఆ సీజన్ నుంచి తప్పుకున్నాడు. మళ్లీ తిరిగి ఐపీఎల్ కి రాలేదు. ఇప్పుడు కూడా వచ్చే టీ20 వరల్డ్ కప్ కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ సీజన్ కి నమోదు చేసుకున్నాడు. అతడిని కోల్ కతా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. మరి.. మిచెల్ స్టార్క్ ని రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి