iDreamPost

ఇండియా పేరును మార్చడంలో తప్పేమి లేదు: మంత్రి రోజా

ఇండియా పేరును మార్చడంలో తప్పేమి లేదు: మంత్రి రోజా

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  ఎక్కువగా చర్చల్లో ఉన్న అంశం “ఇండియా పేరు బదులు భారత్ పెట్టనున్నారు అనేది.  జీ-20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలకు పంపిన ఆహ్వాన పత్రికల్లో ఇండియా బదులు భారత్ అని రాశారు. అక్కడ మొదలైన చర్చ… ప్రస్తుతం దేశవ్యాప్తంగా సాగుతోంది. ప్రపంచ దేశాలు సైతం ఇకపై మన దేశాన్ని ‘భారత్‌’గానే గుర్తించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెడుతుంది. దీంతో కొంతమంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్ధిస్తుంటే.. మరి కొంతమంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఏపీ రాష్ట్ర పర్యటక, క్రీడ శాఖ మంత్రి ఆర్కే రోజా ఈ విషయంపై స్పందించారు. ఇండియా పేరును మార్చడంలో తప్పేమిలేదని మంత్రి రోజా అన్నారు. ఇంకా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బుధవారం మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు పత్యేక పూజలు నిర్వహించి.. స్వామి వారి తీర్ధప్రసాదాలను మంత్రి రోజాకు అందించారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఇండియా పేరును భారత్ గా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటని..  మీడియా అడ్డాగా.. ఆమె స్పందించారు. ఇండియా పేరను భారత్ గా మార్చడంలో తప్పేమి లేదని ఆమె అన్నారు.

ఆమె మాట్లాడుతూ.. ఇండియా పేరు మార్పులో తనకేం తప్పుగా కనిపించడట్లేదని అన్నారు.  ఇంగ్లీష్ లో ఇండియా  అనడం కంటే..తెలుగులో భారత్ అని అనడం చాలా బాగుందని చెప్పుకొచ్చారు.  ఇదే విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు. విపక్షాల కూటమికి ఇండియా అనే  పేరు ఉండడం వల్లే .. ఆ పేరును ప్రభుత్వం మార్చడానికి సిద్ధమైందని చాలా మంది అనుకుంటున్నారని మంత్రి అన్నారు. ఇండియా పేరును భారత్ గా మార్చడంలో తప్పు ఏమిలేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతినకుండా చూడాల్సిన  బాధ్యత మోదీ సర్కార్ పై ఉందని ఆయన తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి