iDreamPost
android-app
ios-app

బీజేపీపై మంత్రి KTR సీరియస్.. చిల్లర సినిమాలంటూ..!

  • Author singhj Published - 09:54 PM, Tue - 19 September 23
  • Author singhj Published - 09:54 PM, Tue - 19 September 23
బీజేపీపై మంత్రి KTR సీరియస్.. చిల్లర సినిమాలంటూ..!

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్​తో పాటు బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకొని ఆయన విమర్శలకు దిగారు. స్కామ్​లకు పాల్పడిన కాంగ్రెస్ నాయకులు డబ్బులు బాగా సంపాదించి, వాటితో ఓట్లు కొనాలనుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. హస్తం పార్టీ నేతలు డబ్బులిస్తే తీసుకోవాలని.. ఓట్లు మాత్రం కారు గుర్తుకే వేయాలని ఓటర్లకు సూచించారు. భద్రాద్రి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్న సత్యనారాయణ బీఆర్ఎస్​లో చేరగా.. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఆ తర్వాత హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అబద్ధపు హామీలను అస్సలు నమ్మొద్దన్నారు.

ముఖ్యమంత్రి ఎవరవుతారో గ్యారెంటీ లేని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీం గ్యారెంటీ అన్నారాయన. హస్తం పార్టీ పవర్​లోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు సీఎంలు, రాజకీయ అస్థిరత గ్యారెంటీ అని కేటీఆర్ చెప్పారు. ఆరు గ్యారెంటీలంటూ డైలాగులు కొట్టిన కాంగ్రెస్ డెవలప్​మెంట్​ మీద ఒక్క మాటైనా చెప్పిందా అని ఆయన ప్రశ్నించారు. పేదల్ని మభ్య పెట్టి ఓట్లు దండుకోవాలనేదే ఆ పార్టీ ఆలోచన అని.. రాష్ట్ర అభివృద్ధిపై వారికి ఆలోచనే లేదని కేటీఆర్ ఫైర్ అయ్యారు.

దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎందుకు అభివృద్ధి చేయలేకపోయిందని మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేశారు. కేసీఆర్ రైతుబంధు కావాలా.. కాంగ్రెస్ రాబందులు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. బీజేపీ మీదా ఆయన విమర్శలు గుప్పించారు. ‘ప్రధాని మోడీ భ్రమల నుంచి ప్రజలు బయటపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ధైర్యం ఉంటే 18 కోట్ల జాబ్స్ ఏమయ్యాయని మోడీ ఇంటి వద్ద ధర్నా చేయాలి. ‘రజాకార్’ చిత్రంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ‘రజాకార్’, ‘ది కశ్మీర్ ఫైల్స్’, ‘కేరళ స్టోరీ’ అంటూ ఎమోషన్స్​తో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ బీజేపీపై కేటీఆర్ సీరియస్ అయ్యారు.

ఇదీ చదవండి: ఇక వాట్సాప్​లోనే మూవీస్, క్రికెట్ అప్​డేట్స్!