iDreamPost
android-app
ios-app

TDP నాశనం అవ్వడానికి లోకేశ్ కారణం: మంత్రి అంబటి

TDP నాశనం అవ్వడానికి లోకేశ్ కారణం: మంత్రి అంబటి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా హాట్ హాట్ గా ఉంటాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అయితే టీడీపీ అధినేత జైలుకు వెళ్లిన తరువాత ఆ పార్టీల్లో కార్యకలాపాలు చాలా తగ్గాయి. ప్రజా సమస్యల కంటే… చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ నేతలకు ధీటుగానే వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీకి దారుణమైన దుస్థితి కారణం.. చంద్రబాబు చేసిన పాపాలే అంటూ కొందరు వైసీపీ నేతలు విమర్శించారు. అయితే టీడీపీ నాశనం అవ్వడానికి నారా లోకేశ్ కారణం అంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని 175 స్థానాలకు 175 గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. బాబు, లోకేశ్ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారని, ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి?. స్కాం కి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని మంత్రి అన్నారు. టీడీపీ నాశనం అవ్వడానికి లోకేశే కారణమని, ఆ పార్టీ నేతలు ఇప్పటికైన గమనించాలని మంత్రి సూచించారు. అంతేకాక టీడీపీ నేతలు నోరు పారేసుకోకుండా  ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలంటూ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. అలానే పవన్ కల్యాణ్ పై కూడా మంత్రి అంబటి రాంబాబు సంచలన  వ్యాఖ్యలు చేశారు. పవన్ కి ఏం బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడని, టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదని అని మంత్రి వ్యాఖ్యానించారు. మరీ.. టీడీపీపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş