iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి!

దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కేవలం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు ప్రాణాలు బలి అవుతున్నారు. నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఆదివారం తెల్లవారజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 ఏళ్ల చిన్నారి సహా 12 మంది మృతి చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వయాజ్‌పూర్ వద్ద హైవే పై శనివారం రాత్రి 12 గంటల తర్వాత కంటెయినర్ అతి వేగంగా వచ్చి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. ముంబైకి సమీపంలో ఈ దారుణ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ నియంత్రణ కోల్పోయి కంటైనర్ ని ఢీ కొట్టినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. మృతుల్లో నలుగు నెలల చిన్నారి, ఆరుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడటంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. వీరంతా బుల్దానీలోని సైలానీ బాబా దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతులను పోస్ట్ మార్టానికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి