iDreamPost

తెలంగాణ టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన ఆటో డ్రైవర్ కుమారుడు.. తండ్రి కష్టానికి కొడుకు గిఫ్ట్!

TS SSC 2024 Results- Auto Dirver Son: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. అతను సాధించిన పాయింట్స్ చూసి అంతా శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

TS SSC 2024 Results- Auto Dirver Son: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కుమారుడు అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. అతను సాధించిన పాయింట్స్ చూసి అంతా శభాష్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలంగాణ టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన ఆటో డ్రైవర్ కుమారుడు.. తండ్రి కష్టానికి కొడుకు గిఫ్ట్!

ఏ పిల్లలకు అయినా తండ్రే సూపర్ హీరో. చిన్నప్పటి నుంచి తండ్రిని అలాగే చూస్తూ పెరుగుతారు. తండ్రి ఏం చేసినా పిల్లల కోసం అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తండ్రి కూడా గత 20 ఏళ్లుగా తన కుటంబం కోసం కష్ట పడుతూనే ఉన్నాడు. తన రక్తాన్ని, స్వైదాన్ని ఇంధనంగా మార్చి ఆటో నడుపుతున్నాడు. రోజు మొత్తం కష్టపడితే వచ్చిన ఆ కొద్ది డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కానీ, పిల్లలను మాత్రం బాగా చదివిచాలన్న ఆయన సంకల్పం మాత్రం వృథా పోలేదు. ఇద్దరు పిల్లలు ఎంతో చక్కగా చదువుతూ తండ్రి కష్టానికి తగిన ఫలితాన్ని చూపిస్తూనే ఉన్నారు. తాజాగా కొడుకు పదో తరగతి ఫలితాల్లో మెరిశాడు.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఆటో డ్రైవర్ పేరు కాకర్ల స్వామి. ఇతను ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్ పిట్టలవాడలో నివాసం ఉంటున్నాడు. గత 20 ఏళ్లుగా ఆటో డ్రైవర్ గా చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్వామికి ఇద్దరు సంతానం. కుమార్తె, కుమారుడు ఉన్నారు. అమ్మాయి ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతోంది. అమ్మాయి కూడా చదువుల్లో టాపే. స్థానిక డిగ్రీ కళాశాలలో ఫ్రీ సీటు పొందింది. ఇంక కుమారుడు అక్షయ్ తాజాగా పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. అక్షయ్ ఇచ్చోడ మండలం నర్సాపూర్ మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. అద్భుతమైన గ్రేడ్ పాయింట్స్ సాధించి ఔరా అనిపించాడు. తెలంగాణ పదో తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్ట్స్ లో ఏ1 గ్రేడ్ సాధించాడు. అలాగే పరీక్షల్లో

10కి 10 పాయింట్లు సాధించి తండ్రి కష్టానికి తగిన ఫలితాన్ని అందించాడు. తండ్రి పడే కష్టానికి తాను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. కొడుకు సాధించిన ఈ విజయంతో ఆ తండ్రి కళ్లు చెమ్మగిల్లాయి. అక్షయ్ సాధించిన ఫలితాలు చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన అక్షయ్.. పదో తరగతి ఫలితాల్లో కార్పోరేట్ పాఠశాలలకు గట్టి పోటీ ఇచ్చాడు. అలాగే అక్షయ్ కి వచ్చిన ఈ మార్కులు చూసి తండ్రి ఎమోషనల్ అయ్యాడు.

తన కుమారుడి ఉన్నత చదువుల కోసం మరింత కష్టపడతాను అంటూ స్వామి వ్యాఖ్యానించారు. అక్షయ్ సాధించిన ఈ మార్కులు చూసి జిల్లా ప్రజలు, ఉపాధ్యాయులు, ఊరి వాళ్లు అంతా అభినందిస్తున్నారు. అక్షయ్ సాధించిన ఫలితాలతో జిల్లాకి కూడా మంచి పేరు వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అక్షయ్ తన భవిష్యత్ లో కూడా ఇలాంటి విజయాలు సాధించి.. ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి.. 10కి 10 పాయింట్లు సాధించిన అక్షయ్ కి కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి