iDreamPost

OTT Movie Suggestion: శబ్దం చేస్తే వింత జీవులు చంపేస్తాయ్! OTTలో యుగాంతాన్ని సూచించే సూపర్ మూవీ!

  • Published May 10, 2024 | 3:16 PMUpdated May 10, 2024 | 3:16 PM

హర్రర్ సినిమాలంటే .. గుండె దడ పెంచేలా ఉండాలి.. ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ చూసే వాళ్ళు ఇలానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఒకవేళ మీరు కానీ ఈ సినిమాను చూడడం మిస్ అయ్యారేమో చెక్ చేసుకోండి.

హర్రర్ సినిమాలంటే .. గుండె దడ పెంచేలా ఉండాలి.. ఈ మధ్య కాలంలో హర్రర్ మూవీస్ చూసే వాళ్ళు ఇలానే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఒకవేళ మీరు కానీ ఈ సినిమాను చూడడం మిస్ అయ్యారేమో చెక్ చేసుకోండి.

  • Published May 10, 2024 | 3:16 PMUpdated May 10, 2024 | 3:16 PM
OTT Movie Suggestion: శబ్దం చేస్తే వింత జీవులు చంపేస్తాయ్! OTTలో యుగాంతాన్ని సూచించే సూపర్ మూవీ!

హర్రర్ సినిమాలను చూసేందుకు ఇప్పుడు అందరు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒక హర్రర్ సినిమా వస్తుంది అంటే ఎంత భయం వేసినా కానీ.. ఒంటరిగా కూర్చుని చూసే సాహసాలు చేస్తున్నారు మూవీ లవర్స్. దీనితో మేకర్స్ కూడా ఆయా జోనర్స్ కు తగిన సినిమాలను ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలిగించే విధంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇక హర్రర్ కంటెంట్ జోనర్ లో ఇప్పటివరకు ఉన్న సినిమాలన్నీ ఒకటైతే.. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా మరొక లెవెల్. ఇక ఈ సినిమాను అర్ధరాత్రి చూసే అంతే సంగతులు. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సినిమా పేరు “ది సైలెన్స్“. ఈ సినిమా 2019 లో విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక బాలీవుడ్ సినిమా.. భాష సంగతి పక్కన పెట్టేస్తే.. బెస్ట్ హర్రర్ మూవీ చూడాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం .. ఓ మంచి హర్రర్ మూవీని మిస్ అయినట్లే. ఈ సినిమా కథేంటంటే.. ఓ రీసెర్చ్ టీం 800 అడుగుల లోతున్న ఒక గుహను పగలగొడతారు. ఆ సమయంలో ఆ గుహ నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి “వెస్ప్స్” అనే కొన్ని వింత జీవులు.. ఆ రీసెర్చ్ టీం ను అతి దారుణంగా చంపేసి.. శబ్దాలను వెతుక్కుంటూ ఆ గుహ లో నుంచి బయట ప్రపంచానికి వస్తాయి. ఈ క్రమంలో అల్లి అనే ఓ కుటుంబం.. ఓ ఇంట్లో నివసిస్తున్నారు. అల్లి అమ్మమ్మకు క్యాన్సర్ వ్యాధి ఉంటుంది. అయితే వెస్ప్స్ అనే జీవులు అందరిని చంపేస్తూ ఉండడంతో.. ప్రభుత్వం అత్యవసర పరిస్థితులను ప్రకటిస్తుంది. అందరు ఇళ్లలోనే ఉండాలని చెప్తుంది.

దీనితో అల్లి కుటుంబం.. శబ్దం ఎక్కువగా ఉండని ప్రాంతానికి వెళ్దాం అని డిసైడ్ అవుతారు. అతనితో అతని స్నేహితుని కుటుంబం కూడా బయలుదేరుతుంది. అనుకోకుండా దారిలో వారి కార్ హైజాక్ కు గురి అవుతుంది. ఎలాగూ ఒకలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారంతా అక్కడి నుంచి తప్పించుకుని.. దగ్గరలో ఉన్న ఓ ఇంటికి వెళ్తారు. ఈ వెస్ప్స్ సంగతి తెలియక ఆ ఇంటి యజమాని గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. దీనితో వెస్ప్స్ ఆమెను దారుణంగా చంపేస్తాయి. ఇక ఆ తర్వాత ఆ కుటుంబం ఈ వెస్ప్స్ నుంచి ఎలా తప్పించుకుంది! వెస్ప్స్ ను తరిమివేసే క్రమంలో వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ! వాటిని తరిమివేశారా లేదా వాటి వలన యుగాంతం వచ్చిందా ! తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి