iDreamPost

10thలో ఫెయిల్ అవుతానన్న భయంతో చనిపోయింది! తీరా రిజల్ట్స్ వచ్చాక చూస్తే!

చదువుకు మార్కులు కొలమానం కాదు. కానీ నేడు విద్య ప్రైవేట్ పరం కావడంతో.. మార్కులే సక్సెస్ పరమావధిగా మారాయి. దీంతో పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. చివరకు ఫలితాల్లో మార్కులు రాకుంటే..

చదువుకు మార్కులు కొలమానం కాదు. కానీ నేడు విద్య ప్రైవేట్ పరం కావడంతో.. మార్కులే సక్సెస్ పరమావధిగా మారాయి. దీంతో పిల్లలపై మానసికంగా ఒత్తిడి పెరిగిపోతుంది. చివరకు ఫలితాల్లో మార్కులు రాకుంటే..

10thలో ఫెయిల్ అవుతానన్న భయంతో చనిపోయింది! తీరా రిజల్ట్స్ వచ్చాక చూస్తే!

‘విజ్ఞానంతోనే వికసించు జగత్తు.. పసిపిల్లల చదువే దానికి విత్తు’ అని ఓ కవి అన్నది అక్షర సత్యం. చదువు కేవలం వికాసాన్ని అందిస్తుంది. చదువు ముఖ్యమే కానీ.. చదువే,మార్కులే ముఖ్యం కాదు. తెలివి తేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మంచి ఉద్యోగం సంపాదించొచ్చు. కానీ నేటి కాలంలో చదువు ప్రైవేట్ పరం అయ్యి.. మార్కులు వ్యాపారంగా మారాయి. దీంతో మార్కుల వెంట పరుగులు పెడుతున్నారు తల్లిదండ్రులు. పిల్లలపై ఒత్తిడి పెంచేస్తున్నారు. ఇంత డబ్బులు పెడుతున్నాం.. ఇన్ని మార్కులు రావాల్సిందేనని భయపెడుతున్నారు. దీంతో పిల్లలు మానసికంగా క్రుంగిపోతున్నారు. చివరకు పరీక్షలు రాయలేక.. మార్కులు రాక సతమతమౌతూ.. చివరకు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, టెన్త్ ఫలితాలు విడుదల కాగా, అనేక మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే.

ఇప్పుడు మరో బాలిక ఆలోచన లేకుండా.. ఆవేదనలో ఆత్మహత్య చేసుకుంది. 10thలో ఫెయిల్ అవుతానన్న భయపడ్డ అమ్మాయి.. తీరా మార్కులు వచ్చాక చూసుకుని తాను ఫెయిల్ అయ్యానని అపార్థం చేసుకుని ఆత్మ నూన్యత భావంతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. తాజాగా కర్ణాటక బోర్డు 10వ తరగతి ఫలితాలు (ఎస్ఎస్ఎల్సీ రిజల్ట్స్) వచ్చాయి. మార్కులు రాగానే చూసుకున్న అమృత.. తాను ఫెయిల్ అయ్యానంటూ ఆవేదనతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాధలో తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన అమృతది హులిగ్‌పురా గ్రామం. మే 9 అనగా గురువారం విడుదల చేసిన ఫలితాలు రాగానే.. చెక్ చేసుకుంది అమృత. అయితే ఆమెకు 625 మార్కులకు గానూ.. 353 మార్కులు వచ్చాయి.

353 మార్కులతో 57 శాతం ఉత్తీర్ణతను సాధించింది. ఈ స్కోర్ చూసుకున్న ఆమె.. ఫెయిల్ అయ్యానని అపార్థం చేసుకుంది. అదే ఆవేదనలో ఉండిపోయింది. ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఉరి వేసుకుంది. కొంత సేపటికి తల్లిదండ్రులు వచ్చి చూడగా.. ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దీంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. చిన్న అపార్థం ఎంతో భవిష్యత్తు ఉన్న బంగారం లాంటి అమ్మాయి జీవితాన్ని లేకుండా చేసింది. తల్లిదండ్రుల కలలను చెరిపేసి.. వారికి గర్భశోకాన్ని మిగిల్చింది. కాగా, ఆమె నాగర్‌కెరె గ్రామంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 10వ తరగతి చదివింది. ఆ అమ్మాయి మరణ వార్త తెలిసి ఫ్రెండ్స్, టీచర్స్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటనపై మద్దూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి