iDreamPost
android-app
ios-app

18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. ప్రతి రోజు రూ.300 పొందే ఛాన్స్‌

  • Published Jun 08, 2024 | 4:57 PMUpdated Jun 08, 2024 | 4:57 PM

మీకు 18 ఏళ్లు నిండాయా.. అయితే కేంద్ర ప్రభుత్వం మీకు శుభవార్త చెప్పనుంది. ప్రతి రోజు 300 రూపాయలు పొందే అవకాశం కల్పించనుంది. ఆ వివరాలు..

మీకు 18 ఏళ్లు నిండాయా.. అయితే కేంద్ర ప్రభుత్వం మీకు శుభవార్త చెప్పనుంది. ప్రతి రోజు 300 రూపాయలు పొందే అవకాశం కల్పించనుంది. ఆ వివరాలు..

  • Published Jun 08, 2024 | 4:57 PMUpdated Jun 08, 2024 | 4:57 PM
18 ఏళ్లు నిండిన వారికి శుభవార్త.. ప్రతి రోజు రూ.300 పొందే ఛాన్స్‌

పేదలు, బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులు, వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను అమలు చేస్తుంటాయి. వీటిలో కొన్నింటికి ఉన్నత విద్య చదివి ఉండాలి. కొన్ని పథకాలకు అర్హులు కావాలంటే.. చదువు లేకపోయినా పర్వాలేదు. 18 ఏళ్ల వయసు ఉంటే సరిపోతుంది. అలాంటి ఓ పథకం గురించే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. ఈ స్కీమ్‌కు అర్హులు కావాలంటే.. 18 ఏళ్లు నిండి ఉంటే సరి. ప్రతి రోజు 300 రూపాయలు పొందవచ్చు. అయితే ఈ పథకం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంతకు ఇది ఏ పథకం.. దీనిలో చేరాలంటే ఏం చేయాలంటే..

ఇంతకు ఇది ఏ పథకం అంటే.. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ స్కీమ్‌. ఈ పథకంలో కొత్త వారికి జాబ్‌ కార్డ్‌ రావాలంటే.. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలానే బ్యాంక్‌ అకౌంట్‌కు ఆధార్‌ కార్డ్‌ అనుసంధానం చేసి ఉండాలి. ఈ డాక్యుమెంట్‌ని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలోని ఏపీఓకి ఇస్తే వారు దాన్ని పరిశీలించి అర్హులైన వారికి జాబ్‌ కార్డ్‌ ఇస్తారు. ఇక ఈ పథకంలో చేరిన వారు రోజుకు రూ.300 రూపాయల చొప్పున పొందవచ్చు. ఇప్పుడు ఈ స్కీమ్‌ కింద కనీస కూలిని రోజుకు రూ.300 గా నిర్ణయించారు. అయితే జరిగిన పనిని ప్రమాణికంగా తీసుకుని వారికి వేతనాన్ని చెల్లిస్తుంటారు.

దేశవ్యాప్తంగా చాలా వరకు రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతుంది. ఈ స్కీమ్‌ అమలులో భాగంగా పని ప్రదేశంలో కూలీలకు తాగునీరు, నీడ, ప్రథమ చికిత్స అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం జరిగితే.. బాధితుడికి 50 వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఇక చిన్న పిల్లలను తీసుకుని పనికి వచ్చే వారి కోసం ఆయాలను నియమించాలని నిబంధన ఉంది. జాబ్‌ కార్డ్‌ ఎంటర్‌ చేసే సమయంలో ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా వాళ్లను వద్దని ముందుగానే చెప్తారు. అయితే ఇది కేవలం వేసవి కాలంలో మాత్రమే ఉంటుంది. అయితే దీన్ని వ్యవసాయ పనులకు అనుసంధానం చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ ఉంది. కేంద్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటే.. అన్నదాతలకు మేలు జరగనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి