iDreamPost

Chiranjeevi: మరీ అంత వైల్డ్‌, మ్యాడ్నెస్‌గా చిరుని చూడగలమా?

సందీప్‌ వంగ తాజా ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమాను చేయాలనే కోరికను బయట పెట్టాడు. దాంతో మెగా ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. సందీప్‌ చిరంజీవితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది?..

సందీప్‌ వంగ తాజా ఇంటర్వ్యూలో చిరంజీవితో సినిమాను చేయాలనే కోరికను బయట పెట్టాడు. దాంతో మెగా ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. సందీప్‌ చిరంజీవితో సినిమా చేస్తే ఎలా ఉంటుంది?..

Chiranjeevi: మరీ అంత వైల్డ్‌, మ్యాడ్నెస్‌గా చిరుని చూడగలమా?

అర్జున్‌ రెడ్డి, యానిమల్‌ సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను ఏర్పర్చుకుని, తన హీరోలు చాలా స్పెషల్‌ అంటూ చెప్పకనే చెప్పిన దర్శకుడు సందీప్ వంగ. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్‌ మాట్లాడుతూ తనకు చిరంజీవితో సినిమా చేయాలని ఉందని ప్రకటించాడు. దాంతో సోషల్‌ మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది.

రామ్‌ గోపాల్‌ వర్మ అన్నట్లుగా దర్శకుడు సందీప్‌ వంగ ఇన్నాళ్లు సినిమాలకు ఉన్న బౌండరీస్‌ను చెరిపేశాడు, హీరోలకు ఉన్న పరిమితులను ఎత్తివేశాడు. హీరోలను ఇలా కూడా చూపించవచ్చా అంటూ ఇతర దర్శకులు కూడా నోరు వెళ్లబెట్టేలా చేశాడు. తాజా చిత్రం ‘యానిమల్‌’ తో వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తున్నాడు. ఇప్పటికే యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.650 కోట్ల వసూళ్లు నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద దడదడలాడిస్తోంది. యానిమల్‌ లో రణబీర్ కపూర్‌ ను దర్శకుడు సందీప్‌ వంగ చూపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు.

హీరోని మరీ ఇంత వైల్డ్‌ గా, మ్యాడ్నెస్ తో చూపిస్తే ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే ఒక భయం లేకుండా దర్శకుడు సందీప్‌ వంగ రూపొందించిన తీరు, రణబీర్‌ కపూర్ నటించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. యానిమల్‌ కంటే ముందు మహేష్ బాబుతో ఒక సినిమాను సందీప్‌ వంగ అనుకున్నాడు. అందులో హీరో పాత్ర యానిమల్‌ లోని హీరో పాత్ర కంటే మరీ వైల్డ్‌గా మ్యాడ్నెస్‌తో ఉంటుందట. అంటే సందీప్‌ వంగ తీసుకునే కథలు, రాసుకునే పాత్రలు అన్నీ కూడా అంతకు మించి అన్నట్లుగా వైల్డ్‌ గా కనిపించబోతున్నాయి.

అలాంటి పాత్ర, కథలో చిరంజీవిని చూపించాలని సందీప్‌ అనుకుంటూ ఉంటాడు. ఒక వేళ చిరంజీవి, సందీప్‌ వంగ సినిమా వస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ లో చర్చ జరిగిన సందర్భంగా ఆసక్తికర విషయాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి మాస్‌గా కనిపించడం వరకు ఓకే కానీ ఆయన చాలా సాఫ్ట్‌ గా కనిపించే పాత్రలు చేస్తేనే బాగుంటుంది.

అలాంటిది సందీప్ మార్క్ వైల్డ్‌ అండ్‌ మ్యాడ్నెస్ తో కనిపించాలి అంటే చిరంజీవి ఫ్యాన్స్ షాక్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వైల్డ్‌ లుక్ లో చిరంజీవిని చూస్తేనే ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అలాంటిది యానిమల్‌ హీరో రేంజ్‌ మ్యాడ్నెస్ తో చూపిస్తాను అంటే కచ్చితంగా బాబోయ్‌ నీకో దండం సందీప్‌ వంగ సినిమా గురించి మెగా ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటారు. వైల్డ్‌ లుక్ లో మ్యాడ్నెస్ పాత్రలో చిరంజీవి ని ఒక మోస్తరు వరకు చూపించి, తనదైన చక్కని స్క్రీన్‌ ప్లే, యూత్‌ని ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో సినిమాను చేస్తే తప్పకుండా సందీప్‌ వంగ మరో విజయాన్ని అందుకునే అవకాశాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సందీప్‌ వంగ దర్శకత్వంలో చిరంజీవి సినిమా వస్తే ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి