iDreamPost

Acharya : మంచి మెగా ఛాన్స్ మిస్ అయిపోయింది

Acharya : మంచి మెగా ఛాన్స్ మిస్ అయిపోయింది

పరిస్థితులు ఎప్పటికప్పుడు మన చేతుల్లో ఉన్నా లేకపోయినా భారీ సినిమాలకు ఒక ప్లానింగ్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. లేదంటే అయ్యో పాపం అనుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆచార్య ఇదే స్టేజిలో ఉంది. ఆర్ఆర్ఆర్ కోసం భీమ్లా నాయక్ తప్పుకుంది. ఎందుకొచ్చిన గొడవని సర్కారు వారి పాట ఎప్పుడో వాయిదా వేసుకుంది. పుష్ప రిస్క్ వద్దనుకుని డిసెంబర్ లో రావడం దాన్ని బ్లాక్ బస్టర్ చేసింది. తీరా చూస్తే ఇప్పుడు సంక్రాంతి బరిలో పెద్ద సినిమా అంటే రాధే శ్యామ్ మాత్రమే ఉంది. అదీ మాట మీద ఉంటుందన్న గ్యారంటీ లేదు. నార్త్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఒత్తిడి వస్తోందని వాయిదా వేసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఇన్ సైడ్ టాక్.

ఒకవేళ ఆచార్య కనక ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉండి సెన్సార్ పూర్తి చేసుకుని ఉంటే ఆర్ఆర్ఆర్ హైప్, క్రేజ్ మొత్తం దీనికి టర్న్ అయిపోయి భారీ వసూళ్లు దక్కేవి. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ కలెక్షన్లు అదిరిపోయేవి. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఉండటంతో క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయేది. మెగా ఫ్యాన్స్ సినిమా యావరేజ్ గా ఉన్నా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ఎంతలేదన్నా నూటా యాభై కోట్ల దాకా టార్గెట్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఉండేది. కానీ ఇంకా లిరికల్ వీడియోలు విడుదలే పెండింగ్ ఉంది. కొంత ప్యాచ్ వర్క్ కూడా పూర్తి చేయాలట. ఒకే నెలలో నాలుగు షూటింగ్స్ లో పాల్గొన్న మెగాస్టార్ స్వంత ప్రొడక్షన్ ఆచార్యని రెండేళ్లకు పైగా ఎందుకింత డిలే చేశారో తెలియాలి.

రెండు టీజర్లు రెండు పాటలు వచ్చాక కూడా ఆచార్య హైప్ ఇంకా పీక్స్ కు వెళ్ళలేదు. ఆర్ఆర్ఆర్ హడావిడిలో వద్దనుకుని సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఇదే శాపమై కూర్చుంది. సంక్రాంతి బరిలో ఆచార్య పర్ఫెక్ట్ ఛాయస్ అయ్యేది. కానీ ఒక్క శాతం అవకాశం కూడా లేకుండా పోయింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే జోడిగా నటించింది. ఇవాళే రెజీనాతో చిరు ఆడిపాడిన శానా కష్టం అనే ఐటెం సాంగ్ ప్రోమో కూడా విడుదల చేశారు. ఇన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న ఆచార్య సరైన సమయానికి సిద్ధంగా లేకపోవడంతో బంగారు బాతుని డీజే టిల్లు లాంటి చిన్న సినిమాలు తినబోతున్నాయి

Also Read : Radhe Shyam : డార్లింగ్ టీమ్ మాట మీద ఉంటుందా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి