iDreamPost

కొత్త సంవత్సరం OTT కానుకలు

కొత్త సంవత్సరం OTT కానుకలు

ఇంకో రెండే రోజుల్లో న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కాలం మెట్రో ట్రైయిన్ స్పీడ్ తో పరుగులు పెడుతుంటే టైం ఇట్టే కరిగిపోతోంది. సినిమా పరిశ్రమకు సంబంధించి 2022 చక్కగా గడిచిపోయింది. బాలీవుడ్ ని పూర్తిగా డామినేట్ చేస్తూ దక్షిణాది సగర్వంగా జెండా ఎగరేసింది. ఓటిటి కంటెంట్ కూడా ఈ ఏడాది మంచి సందడి చేసింది. కొత్త సంవత్సరం కానుకగా ఈసారి చాలా కంటెంట్ ప్రేక్షకుల ఇళ్లలోకి వస్తోంది. అదేంటో చూద్దాం. అనుపమ పరమేశ్వన్ కీలక పాత్ర పోషించిన థ్రిల్లర్ ‘బటర్ ఫ్లై’ ఇవాళ్టి నుంచే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. భూమిక, రావురమేష్ లాంటి సీనియర్ తారాగణంతో క్యాస్టింగ్ బాగా నిండుగా ఉంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి

ఇవాళ రాత్రి 9 గంటలకు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాలకృష్ణ ప్రభాస్ ల అన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ 1 ఆడియన్స్ ముందుకు రానుంది. వ్యూస్ లో సరికొత్త రికార్డులు ఖాయమని ఆహా చాలా నమ్మకంగా ఎదురు చూస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో హిందీ మూవీ ‘డబుల్ ఎక్స్ ఎల్’ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది. విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించిన ‘DSP’ తెలుగు వెర్షన్ థియేటర్లకు రాలేదు కానీ నేరుగా తమిళంతో పాటు సన్ నెక్స్ట్ లో ఆదివారం నుంచి చూడొచ్చు. విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ని నెట్ ఫ్లిక్స్ లోనే సండే నుంచి ఎంజాయ్ చేయోచ్చు. భారీ బడ్జెట్ తో రూపొందిన ‘ఆర్ యా పార్’ బహుబాషాల్లో హాట్ స్టార్ లోనే రేపటి నుంచి స్ట్రీమింగ్ చేస్తారు

నయనతార-పృథ్విరాజ్ ల ‘గోల్డ్’ని మళయాలంలోనే ప్రైమ్ లో చూడొచ్చు. ప్రేమమ్ దర్శకుడి లేటెస్ట్ డిజాస్టర్ ఇది. ఇవి కాకుండా ఇతర లాంగ్వేజెస్ లో వివిధ సినిమాలు వెబ్ సిరీస్ లు పలకరించబోతున్నాయి. థియేటర్లలో చెప్పుకోదగ్గ రిలీజులేవి లేకపోవడంతో ఈసారి ఎక్కువ శాతం ప్రేక్షకులు ఇంట్లోనే వినోదాన్ని అందుకోవడానికి మొగ్గు చూపేలా ఉన్నారు. బాక్సాఫీస్ ఎంత డల్ గా ఉందంటే వేరే ఆప్షన్లు ఖుషి రీ రిలీజ్ నే బెనిఫిట్ షోలు వేసేంత రేంజ్ లో ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఓటిటి నిబంధనల్లో మార్పులు తీసుకురావాలని ఇండస్ట్రీ పెద్దలు ఎంతగా ప్రయత్నించినా అవి కార్యరూపం దాల్చడం లేదు. సో పాత పద్దతే ఇకపై కూడా ఉంటుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి