iDreamPost
android-app
ios-app

ఇంగ్లండ్‌ పరువుతీసేలా లబుషేన్‌ కామెంట్స్‌! డిక్షనరీలో ఆ పదం చేర్చడంపై..

  • Author Soma Sekhar Published - 02:55 PM, Thu - 2 November 23

ఇంగ్లాండ్ జట్టు పరువు తీశాడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్. బజ్ బాల్ క్రికెట్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి.. ఇంగ్లాండ్ ను ట్రోల్ చేశాడు.

ఇంగ్లాండ్ జట్టు పరువు తీశాడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్. బజ్ బాల్ క్రికెట్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి.. ఇంగ్లాండ్ ను ట్రోల్ చేశాడు.

  • Author Soma Sekhar Published - 02:55 PM, Thu - 2 November 23
ఇంగ్లండ్‌ పరువుతీసేలా లబుషేన్‌ కామెంట్స్‌! డిక్షనరీలో ఆ పదం చేర్చడంపై..

డిఫెండింగ్ ఛాంపియన్ గా, భారీ అంచనాలతో వరల్డ్ కప్ 2023 బరిలోకి దిగింది ఇంగ్లాండ్. కానీ ఇంగ్లీష్ జట్టు అంచనాలన్నీ తలకిందులై.. తీవ్ర విమర్శల పాలవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో దారుణంగా విఫలం అయ్యింది ఇంగ్లాండ్ టీమ్. 6 మ్యాచ్ ల్లో కేవలం ఒకే ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థాయిలో నిలిచింది. అయితే బజ్ బాల్ క్రికెట్ కు పెట్టింది పేరుగా కొన్ని నెలల క్రితం ప్రపంచాన్ని ఉర్రూతలూగించింది ఇంగ్లాండ్. కానీ వరల్డ్ కప్ కు వచ్చేసరికి సీన్ మెుత్తం రివర్స్ అయ్యింది. తన కంటే చిన్న జట్ల చేతిలో ఓడి.. ఇంటిదారి పట్టింది. దీంతో ఇంగ్లీష్ జట్టుపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు కురుస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ జట్టు పరువు తీశాడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్. బజ్ బాల్ క్రికెట్ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచి.. ఇంగ్లాండ్ ను ట్రోల్ చేశాడు.

బజ్ బాల్.. క్రికెట్ గురించి తెలిసిన సగటు అభిమానికి ఈ పదం తెలిసే ఉంటుంది. బ్రెండన్ మెక్ కల్లామ్ ఇంగ్లాండ్ టీమ్ బ్యాటింగ్ కోచ్ గా నియమించబడ్డ కాడినుంచి.. ఈ పేరు వరల్డ్ క్రికెట్ లో మారుమ్రోగిపోయింది. బజ్ బాల్ క్రికెట్ తో ఇటీవల ఇంగ్లాండ్ క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించింది. అయితే గత కొన్ని నెలల నుంచి ఈ స్ట్రాటజీ వర్కౌట్ కావట్లేదు. మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ దారుణంగా విఫలం అయ్యింది. బజ్ బాల్ క్రికెట్ అటుంచి.. సాధారణ క్రికెట్ ను ఆడలేక వరల్డ్ కప్ నుంచి ఇంటిదారి పట్టింది.

ఇక ఇంగ్లాండ్ ఆటతీరుపై సొంత జట్టు మాజీ ఆటగాళ్లతో పాటుగా ఇతర దేశాల ప్లేయర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్ బజ్ బాల్ స్ట్రాటజీపై లబూషేన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ రిపోర్టర్ బజ్ బాల్ క్రికెట్ అనే పదాన్ని డిక్షనరీ చేర్చడంపై నీ అభిప్రాయాం ఏంటి? అని ఆసీస్ స్టార్ క్రికెటర్ లబూషేన్ ను ప్రశ్నించాడు. దానికి అతడు.. అదొక చెత్త అని బదులిచ్చాడు. దాని గురించి ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని బదులిచ్చాడు లబూషేన్. దీంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లబూషేన్ బజ్ బాల్ స్ట్రాటజీని చెత్తగా వర్ణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişBetcioivermectin tabletMadridbet girişMadridbet girişMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinTophillbetJojobet GirişcasibomCasibom GirişHoliganbetgalabetHoliganbetMarsbahis Giriş