iDreamPost

వెస్టిండీస్​ను ఛాంపియన్​గా నిలిపిన స్టార్ ప్లేయర్​పై ICC నిషేధం!

  • Author singhj Published - 04:22 PM, Thu - 23 November 23

వెస్టిండీస్​ను ఛాంపియన్​గా నిలిపిన స్టార్ క్రికెటర్​పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరా ప్లేయర్? ఐసీసీ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

వెస్టిండీస్​ను ఛాంపియన్​గా నిలిపిన స్టార్ క్రికెటర్​పై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎవరా ప్లేయర్? ఐసీసీ ఎందుకిలా చేసిందో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 04:22 PM, Thu - 23 November 23
వెస్టిండీస్​ను ఛాంపియన్​గా నిలిపిన స్టార్ ప్లేయర్​పై ICC నిషేధం!

క్రికెట్​లో అన్ని బోర్డుల కంటే ఇంటర్నేషనల్ క్రికెట్​ కౌన్సిల్ (ఐసీసీ) పెద్ద అనేది తెలిసిందే. అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు దీన్ని బాస్​గా చెప్పొచ్చు. జెంటిల్మన్ గేమ్​కు సంబంధించి మ్యాచ్​ల షెడ్యూల్, నిబంధనల సవరణ దగ్గర నుంచి వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ లాంటి బడా టోర్నీల నిర్వహణ వరకు అంతా ఐసీసీనే చూసుకుంటుంది. దైపాక్షిక సిరీస్​ల విషయంలో ఇది తలదూర్చదు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​లో జరిగే ప్రతి విషయాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అవినీతి ఆరోపణలు లాంటి వాటిపై కాస్త ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఆ దేశ సర్కారు తలదూర్చడం రూల్స్​కు విరుద్ధమంటూ బ్యాన్ విధించింది ఐసీసీ. అలాగే సింహళ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్ కప్​ను అక్కడి నుంచి సౌతాఫ్రికాకు తరల్చింది. ఇప్పుడు ఐసీసీ మరో దిగ్గజ ప్లేయర్​కు షాకిచ్చింది. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్​పై 6 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్​ను అతిక్రమించారనే ఆరోపణలకు సంబంధించి శామ్యూల్స్ దోషిగా తేలాడు. ఈ నేపథ్యంలో సీరియస్ అయిన ఐసీసీ.. అతడిపై ఆరేళ్ల పాటు బ్యాన్ వేసింది. ఎమిరేట్స్ బోర్డు యాంటీ కరప్షన్ కోడ్​ను ఉల్లంఘించాడంటూ 2021 సెప్టెంబర్​లో శామ్యూల్స్​ మీద నాలుగు అభియోగాలను మోపారు.

శామ్యూల్స్ మీద మోపిన అభియోగాలపై విచారణ జరిపిన ఐసీసీ అవినీతి నిరోధక శాఖ అధికారులు 2023 ఆగస్టులో అతడ్ని దోషిగా తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ విండీస్ సీనియర్​ను అన్ని రకాల క్రికెట్ వ్యవహారాల నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ బ్యాన్ నవంబర్ 11 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ డెసిజన్​ను ఐసీసీ హెడ్​ఆర్ అండ్ ఇంటిగ్రిటీ యూనిట్​కు చెందిన అలెక్స్ మార్షల్ వెల్లడించారు. దాదాపు 20 ఏళ్ల పాటు శామ్యూల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాడని.. ఆ టైమ్​లో అనేకసార్లు అవినితీ వ్యతిరేక సెషన్లలో అతడు పాల్గొన్నాడని ఐసీసీ అధికారులు తెలిపారు. యాంటీ కరప్షన్ కోడ్ ప్రకారం తన బాధ్యతలు ఏంటో అతడికి కచ్చితంగా తెలుసన్నారు.

క్రికెట్ నుంచి శామ్యూల్స్ రిటైర్ అయినప్పటికీ.. నేరం జరిగిన టైమ్​లో అతడు క్రికెట్​లో పాల్గొనేవాడని ఐసీసీ అధికారులు చెప్పారు. రూల్స్​ను ఉల్లంఘించే ఉద్దేశం ఉన్నవారికి ఈ బ్యాన్ గట్టిగా హెచ్చరిస్తుందని పేర్కొన్నారు. ఇక, 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్​లో శామ్యూల్స్ విండీస్ తరఫున 300కు పైగా మ్యాచులు ఆడాడు. 17 ఇంటర్నేషనల్ సెంచరీలు నమోదు చేశాడతను. వన్డేల్లో కరీబియన్ టీమ్​కు కెప్టెన్​గానూ వ్యవహరించాడు. 2012, 2016లో విండీస్ టీమ్ టీ20 వరల్డ్ కప్స్​ నెగ్గడంలో అతడి పాత్ర చాలా ఉంది. అప్పటి ఫైనల్స్​లో శామ్యూల్స్ టాప్ స్కోరర్​గా నిలిచాడు. వెస్టిండీస్ తరఫున మొత్తంగా 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లు ఆడిన శామ్యూల్స్ 11,134 రన్స్ చేశాడు. అలాగే 152 వికెట్లు తీశాడు. గతేడాది నవంబరులో అతడు రిటైర్మెంట్ తీసుకున్నాడు. మరి.. శామ్యూల్స్​పై ఐసీసీ బ్యాన్ విధించడం మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కాంట్రాక్ట్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న రాహుల్ ద్రవిడ్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి