iDreamPost

కరోనా వ్యవహారంపై మావోయిస్టు పార్టీ బహిరంగలేఖ

కరోనా వ్యవహారంపై మావోయిస్టు పార్టీ బహిరంగలేఖ

దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఈరోజు ఓ లేఖను విడుదల చేసింది. కరోనా సామ్రాజ్య వాదుల సృష్టి అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. సామ్రాజ్యవాదాన్ని అరికట్టడం వల్లనే కరోనా ను అంతం చేయగలమని స్పష్టం చేసింది.

లాక్ డౌన్ సమయంలో నష్టపోతున్న అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం సహాయం చేయాలని డిమాండ్ చేసింది.అవకాశాల మేరకు లాక్ డౌన్ సడలించాలని సూచించింది. కరోనా నియంత్రణ పై బిజెపి చర్యలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని ఎద్దేవా చేసింది. hydroxychloroquine ఔషధాల ఎగుమతులపై నిషేధం విధించాలని డిమాండ్ చేసింది.

కరోనా వైరస్ ను ఒక కమ్యూనిటీకి పరిమితం చేస్తూ.. బిజెపి ప్రభుత్వం మతం రంగు పులుముతోందని ఆరోపించింది. కరోనా వైరస్ ను బూచిగా చూపి ముస్లింలను సమాజం నుంచి వేసే ప్రయత్నం చేస్తోందని మండిపడింది. అక్రమ కేసులో అరెస్టయి జైలులో అనారోగ్యం తో మగ్గుతున్న ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి