iDreamPost
android-app
ios-app

‘మిరాయ్’ బ్లాక్ స్వార్డ్ గ్లింప్స్ రిలీజ్!  విలన్ గా మనోజ్ విశ్వరూపం చూశారా?

  • Published May 20, 2024 | 2:48 PM Updated Updated May 20, 2024 | 2:48 PM

Mirai-The Black Sword Glimpse: మిరాయ్ మూవీలో విలన్ గా మంచు మనోజ్ పాత్రను పరిచయం చేస్తూ.. మేకర్స్ బ్లాక్ స్వార్డ్ అనే డేంజరస్ ఫోర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో విలన్ గా మనోజ్ తన నట విశ్వరూపం చూపించాడు.

Mirai-The Black Sword Glimpse: మిరాయ్ మూవీలో విలన్ గా మంచు మనోజ్ పాత్రను పరిచయం చేస్తూ.. మేకర్స్ బ్లాక్ స్వార్డ్ అనే డేంజరస్ ఫోర్స్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో విలన్ గా మనోజ్ తన నట విశ్వరూపం చూపించాడు.

‘మిరాయ్’ బ్లాక్ స్వార్డ్ గ్లింప్స్ రిలీజ్!  విలన్ గా మనోజ్ విశ్వరూపం చూశారా?

‘మిరాయ్’ ప్రస్తుతం టాలీవుడ్ తో పాటుగా సినిమా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన చిత్రం. ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా లెవల్లో హిట్ కొట్టిన హీరో తేజ సజ్జ నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీకి సంబంధించి విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ‘బ్లాక్ స్వార్డ్’ అంటూ విలన్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. ఇందులో మంచు మనోజ్ విలన్ గా తన విశ్వరూపం చూపించాడు. భారీ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న మిరాయ్ ఇండస్ట్రీ ప్రముఖులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది.

టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘మిరాయ్’. ఇందులో తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కార్తీక్ మేకింగ్ కు ఇండస్ట్రీ షేక్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీలో విలన్ గా నటించిన మంచు మనోజ్ పాత్రను పరిచయం చేస్తూ.. మేకర్స్ ‘బ్లాక్ స్వార్డ్’ అంటూ గ్లింప్స్ ను విడుదల చేసింది. ఈ లుక్ లో మంచు వారి అబ్బాయి లుక్ అరహో అనిపించింది.

‘మిరాయ్’ మూవీలో బ్లాక్ స్వార్డ్ అనేది మోస్ట్ డేంజరస్ ఫోర్స్ గా గ్లింప్స్ లో అభివర్ణించారు. ఇక ఈ ఫోర్స్ కు మంచు మనోజ్ నాయకుడుగా కనిపించబోతున్నాడని చూస్తే అర్దమవుతుంది. విలన్ గా మనోజ్ లుక్ అదిరిపోయింది. అతడు చేసే కత్తి యుద్ధం మతిపోయేలా ఉంది. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ తో అదరగొట్టాడు డైరెక్టర్. మనోజ్ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ ను విడుదల చేశారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు మనోజ్. హీరో నుంచి విలన్ గా మారి మరో లెవల్లో పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు మనోజ్. బ్లాక్ స్వార్డ్ అంటూ విడుదల చేసిన కొన్ని సెకన్ల గ్లింప్స్ లోనే నట విశ్వరూపం చూపించాడు మంచు వారి అబ్బాయి. అశోకుడి రహస్య గ్రంథాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కార్తీక్ ఘట్టమనేని డెవిల్ మూవీతో స్టైలిష్ డైరెక్టర్ గా ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తుంటే.. కచ్చితంగా హిట్ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా.. ఈ లుక్ లో మనోజ్ ను చూస్తే గూస్ బంప్స్ పక్కా. మరి మిరాయ్ లో మనోజ్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis