iDreamPost

వీడియో: 3ఇడియట్స్ తరహాలో బైక్ పై రోగితో ఆస్పత్రికి..

3 Idiots Scene: అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ సినిమా అందరికి గుర్తుతుండే ఉంటుంది. ఆ సినిమాలోని ప్రతి సీన్ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా 3 ఇడియట్స్ సినిమాలోని ఓ సీన్ రియల్ గా చోటుచేసుకుంది.

3 Idiots Scene: అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ సినిమా అందరికి గుర్తుతుండే ఉంటుంది. ఆ సినిమాలోని ప్రతి సీన్ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా 3 ఇడియట్స్ సినిమాలోని ఓ సీన్ రియల్ గా చోటుచేసుకుంది.

వీడియో: 3ఇడియట్స్ తరహాలో బైక్ పై రోగితో ఆస్పత్రికి..

మనిషికి ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. అలా అనుకోకుండా ఏదైనా ప్రాణపాయ స్థితి ఏర్పడితే..కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుంటారు. అలా రోగిని ఆస్పత్రికి తరలించే క్రమంలో త్వరగా తీసుకెళ్లాలనే ధ్యాసే తప్పా.. ఎలా వెళ్తున్నామనేది కూడా ఆలోచించరు. అలా తమ వారి ప్రాణాలు కాపాడేందుకు కొన్నిసార్లు సినిమాల తరహాల్లో సాహసాలు కూడా చేస్తుంటారు. ఇప్పటికే సినిమాటిక్ స్టైల్ లో ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా అమీర్ ఖాన్ హీరోగా నటించిన త్రీ ఇడియట్స్ సినిమాలోని ఓ సీన్ తరహాల్లో ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఇదే సినిమా సౌత్ లో కూడా స్నేహితుడు పేరుతో విడుదలైంది. ప్రస్తుతం రియల్ త్రీ ఇడియట్స్ సీన్ కి సంబంధించిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇళయ దళపతి విజయ్, జీవా, శ్రీకాంత్ హీరోలుగా నటించిన చిత్రం స్నేహితుడు. 2012లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో విజయ్ కి జోడిగా ఇళియనా నటించింది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. విద్యావ్యవస్థలో లోపాలు, ముగ్గురి స్నేహితుల మధ్య ఉన్న బాండింగ్ అనే ప్రధానాంశంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతి సీన్  అందరిని ఆకట్టుకుంటుంది. అలానే ఓ సీన్ లో విజయ్.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ ముసలాయను బైక్ పై ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అంతేకాక బైక్ తోనే ఏకంగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. ఆ రోగిని ఆస్పత్రిలో చేర్చిన అనంతరం ఊపిరి పీల్చుకుని  బయటకు వచ్చారు.

అచ్చం అదే సీన్ తరహా ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో స్నేహితుడు మూవీ తరహ ఘటన ఆవిష్కృతమైంది. నీరజ్‌గుప్తా అనే యువకుడి తాత శనివారం రాత్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కంగారు పడి వెంటనే తన స్నేహితుడి సాయంతో నీరజ్ తాతను ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని..స్థానిక ఉన్న సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నాడు. తన తాత పరిస్థితి సీరియస్ గా ఉండటంతో నేరుగా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డు వరకు బైక్ పై వెళ్లాడు. ఇలా ఊహించని ఈ పరిణామంతో అక్కడున్నవారంతా కాసేపు అవాక్కయ్యారు.

బైక్ పై నేరుగా అత్యవసర విభాగం వరకు  తీసుకురావడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాసేపటికి తేరుకున్న ఆస్పత్రి సిబ్బంది రోగిని కిందికి దించారు. తన తాతను ఎమర్జెన్సీ వార్డులోకి చేర్చిన తరువాత బైక్‌ను వెనక్కు తిప్పి నీరజ్ బయటకు వెళ్లాడు. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న స్థలంలో బైక్ ను పార్కింగ్ చేసి..మళ్లీ లోనికి వచ్చాడు. ఈ వ్యవహారంపై ఆస్పత్రి వైద్యులు నీరజ్‌గుప్తాను మందలించారు. అయితే అతడు చేసిన  పనిని అర్థం చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. మరి.. స్నేహితుడు మూవీ తరహాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి