iDreamPost
android-app
ios-app

మళ్లీ రావా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ రేంజ్‌లోనా? హీరోయిన్స్ కూడా సరిపోరు!

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ మళ్లీ రావా. సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లు. ఇందులో చైల్డ్ అంజలిగా నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ మూవీ మళ్లీ రావా. సుమంత్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లు. ఇందులో చైల్డ్ అంజలిగా నటించిన పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

మళ్లీ రావా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఈ రేంజ్‌లోనా? హీరోయిన్స్ కూడా సరిపోరు!

తొలి తరం దిగ్గజ నటుల్లో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని భావించే వారు అప్పట్లో. కాగా, ఏఎన్నార్ నుండి నటనను వారసత్వంగా పుచ్చుకుని వచ్చారు ఆయన కుమారుడు, మనవళ్లు, మనవరాలు. అక్కినేని నాగార్జున హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా, స్టూడియో అధినేతగా రాణిస్తున్నారు. ఈయన కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. వీరి కన్నా ముందే ఇండస్ట్రీలోకి వచ్చి.. మంచి సినిమాలే చేసినా.. స్టార్ డమ్‌కు ఆమడ దూరంలో ఆగిపోయిన హీరో సుమంత్. రామ్ గోపాల్ వర్మ ప్రేమ కథ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ టాలెంట్.. ఇప్పుడు స్పెషల్ రోల్స్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన హీరోగా నటించిన సినిమాల్లో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం మళ్లీ రావా.

జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఫస్ట్ మూవీ మళ్లీ రావా.. 2017లో వచ్చిన ఈ సినిమా సైలెంట్ హిట్. సుమంత్.. ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లు. గౌతమ్ అభినవ్ మఠం కీలక పాత్ర పోషించాడు. ఇందులో హీరో హీరోయిన్లది చిన్నప్పటి ప్రేమ. కానీ చివరి వరకు ముడిపడని విరహ ప్రేమ కథ. ఇందులో చైల్డ్ సుమంత్‌గా సాత్విక్ వర్మ నటించగా.. ఆకాంక్ష చిన్నప్పటి రోల్ పోషించింది ప్రీతి ఆస్రానీ. ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గుండెల్లో గోదారిలో కూడా కనిపించింది. స్వతహాగా గుజరాతి అయిన ప్రీతి.. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తుండటంతో హైదరాబాద్‌కు వచ్చేసింది. అలాగే పక్కింటి అమ్మాయి అనే సీరియల్లో కూడా యాక్ట్ చేసింది. 2017లో మళ్లీ రావాలో చైల్డ్ అంజలిగా అలరించింది.

అందులో చాలా కామ్ గర్ల్‌గా కనిపిస్తోంది. ఇందులో ఈ పాపకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అప్పటికే యవ్వన దశలోకి వచ్చేసిన ప్రీతి.. హ్యపీ వెడ్డింగ్ చిత్రంలో నిహారిక చెల్లెలిగా నటించింది. ఇక ప్రెజర్ కుక్కర్ అనే మూవీతో హీరోయిన్‌గా మారిపోయింది. చూస్తుండగానే.. పాప.. పెద్దదైపోయింది. గోపీచంద్, తమన్నా హీరో హీరోయిన్లుగా వచ్చిన సీటీమార్ మూవీలో కూడా నటించింది. కబడ్డీ జట్టు కెప్టెన్‌గా చేసింది ఈ నటినే. ఇక దొంగలున్నారు జాగ్రత్త మూవీలో సింహా కొడూరి సరసన ఆడి పాడింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన యశోదలో కూడా కనిపించింది. ఇందులో సమంత సోదరిగా బృంద పాత్రలో మెరిచింది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సత్తా చాటుతోంది. ప్రీతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఫోటో షూట్లతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetcasibomjojobet girişmeritkinggalabetjojobetholiganbet girişMarsbahis GüncelMarsbahis GirişMarsbahis Güncel GirişJojobet GirişCasibom