iDreamPost

ఆ 2 రోజులు సెలవులు ఇవ్వరా? స్పీకర్‌కు మల్లారెడ్డి రిక్వెస్ట్!

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడవ రోజుకు శాసన సభ సమావేశాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం కృష్ణా నదీ జలాలపై హోరా హోరీగా చర్చ జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి..

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మూడవ రోజుకు శాసన సభ సమావేశాలు చేరుకున్నాయి. ఈ క్రమంలో సోమవారం కృష్ణా నదీ జలాలపై హోరా హోరీగా చర్చ జరిగింది. ఈ క్రమంలో మల్లారెడ్డి..

ఆ 2 రోజులు సెలవులు ఇవ్వరా? స్పీకర్‌కు మల్లారెడ్డి రిక్వెస్ట్!

తెలంగాణలో శాసన సభ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడం గమనార్హం. శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈ ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాకుండా మధ్యంతర బడ్జెట్ ను రూపొందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,75,891 కోట్లతో ఓటాన్ బడ్జెట్‌ను తీసుకు వచ్చింది కాంగ్రెస్ సర్కార్.   సోమవారం నాటికి శాసన సభ సమావేశాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. కృష్ణా జలాల వాటాపై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చర్చ జరిగింది.

కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ సర్కార్ అనేక తప్పులు చేసిందంటూ మండి పడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఈ క్రమంలో వాడీ వేడి చర్చ జరుగుతోంది. అంతలో సభను 14కు వాయిదా వేయాలని భావించారు స్పీకర్. అయితే బీఆర్ఎస్ మేడల్చ్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఓ మాట విన్నవించారు. ఫిబ్రవరి 14, 15 తేదీల్లో అనగా బుధ, గురువారాల్లో చాలా పెళ్లిళ్లు ఉన్నాయని చెప్పారు. వసంత పంచమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయని, ఆ రెండు రోజులు.. అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దంటూ పేర్కొన్నారు. సభ్యుల కోరిక మేరక సభ నిర్వహించవద్దని మా రిక్వెస్ అంటూ కోరారు.

కాగా, సభలో ఈ రోజంతా కృష్ణా జలాల విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు.. బీఆర్ఎస్ కూడా అదే లెవల్లో కౌంటర్ ఇస్తూ పోయింది. అధికార పక్షం ప్రస్తావించి ప్రతి అంశానికి.. తనదైన కౌంటర్ ఇస్తోంది విపక్షం. మాటల యుద్ధం జరిగింది. మొత్తానికి సోమవారం హోరా హోరీగా అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. దీంతో శాసన సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. మరీ మల్లారెడ్డి కోరినట్లు.. ఆ రెండు రోజులు సభ నిర్వహిస్తారో లేదో ఇంకా తెలియరాలేదు. కాగా, శాసన సభ సమావేశాలు.. ఈ నెల 13 వరకు పొడిగించాలని స్పీకర్ నిర్ణయం తీసుకోగా.. ఇప్పుడు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉన్నట్లు.. మల్లారెడ్డి కోరిన రిక్వెస్ట్ ను బట్టి అర్థమౌతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి