iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి మృతి

  • Published Nov 29, 2023 | 10:21 PM Updated Updated Nov 29, 2023 | 10:21 PM

ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటన్న విషయం తెలిసిందే. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

ఈ మద్య కాలంలో సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటన్న విషయం తెలిసిందే. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు.

  • Published Nov 29, 2023 | 10:21 PMUpdated Nov 29, 2023 | 10:21 PM
ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి మృతి

ఇటీవల పలు సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటీనటులు, దర్శకర నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు కూడా శోక సంద్రంలో మునిగిపోతున్నారు. గుండెపోటు, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు. తాజాగా సినీ నటి, గాయని సెట్ లోనే హఠాత్తుగా కుప్పకూలి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే..

మలేషియాకు చెందిన ప్రముఖ గాయని, నటి క్విన్టీ చెంగ్ (37) కన్నుమూసింది. క్విన్జీ చెంగ్ స్క్వాడ్ సెకవాన్ అనే సోషల్ మీడియా ఛానెల్ కోసం చిత్రీకరిస్తున్నప్పుడు సెట్‌లో కుప్పకూలిపోయింది. స్క్వాడ్ సెకవాన్ని నివేదికల ప్రకారం.. షూటింగ్ సమయంలో ఆమెకు తల తిరగడం, తలనొప్పి వస్తుందని చెప్పి కొద్ది సేపు విరామం తీసుకుంది. వెంటనే యూనిట్ సభ్యులు అంబులెన్స్‌ లో హాస్పిటల్ కి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ క్విన్జీని బతికించలేకపోయారు. ఆమె ఆరోగ్యం విషయంగా మారడంతో కన్నుమూసిందని వైద్యులు తెలిపారు.

షూటింగ్ సమయంలో క్విన్జీ హర్ట్ బీట్ బాగా పెరిగిపోయిందని, పెదవులు, చేతులు, పాదాల రంగు మారడం జరిగిందని అంటున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హిస్పిటల్ కి తరలించారు. పోస్ట్ మార్టం నివేదికలు వస్తే అసలు కారణం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. 1986, ఫిబ్రవరి 26న మలేషియాలోని పెర్లిస్ లో నటి క్విన్జీ చెంగ్ జన్మించింది. చిన్ననాటి నుంచి సాంగ్స్ పాడటం, నటనపై అభిమానంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మృతిపై ప్రముఖ నటీనటులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alKulisbetKulisbetberlinbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş