Swetha
ఎప్పటిలానే ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మలయాళీ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ క్రమంలో తాజాగా మరో మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది.
ఎప్పటిలానే ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వచ్చేసింది. ఈ మధ్య కాలంలో తెలుగులో మలయాళీ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ అంత ఇంత కాదు. ఈ క్రమంలో తాజాగా మరో మలయాళీ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసింది.
Swetha
ఓటీటీ లో సినిమాలకు రోజు రోజుకి ఆదరణ బాగా పెరిగిపోతుంది. భాషతో సంబంధం లేకుండా.. సినిమా కథను బట్టి ఆయా సినిమాలు ఓటీటీలలో మంచి వ్యూవర్ షిప్ తో దూసుకుపోతున్నాయి. అందులోను ఇప్పుడు ఎక్కువగా అందరు క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ నే ఇష్టపడుతున్నారు. దీనితో మేకర్స్ కూడా ఈ సినిమాలపైన స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలో మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన .. క్రైమ్ థ్రిల్లర్ ఒకటి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి అతిధి పాత్రలో, జయరాం లీడ్ రోల్లో కనిపించిన ఈ సినిమా “అబ్రహం ఓజ్లర్” డిసెంబర్ లో రిలీజ్ అయ్యి.. భారీ విజయాన్ని సాధించింది. అయితే, ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలో ప్రసారం అవుతోంది.
మమ్ముట్టి సీరియల్ కిల్లర్ గా నటించిన “అబ్రహం ఓజ్లర్” ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకుపైగా వసూళ్లు సొంతం చేసుకుంది.అయితే, మొదట్లో ఈ సినిమా గురించి యావరేజ్ టాక్ వచ్చినా కూడా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీగానే వసూళ్లను సంపాదించింది. జయరాం ప్రధాన పాత్రలో కనిపించగా.. మమ్ముటి అతిధి పాత్రలో నటించారు. అబ్రహం ఓజ్లర్ మూవీ మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా మార్చి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. జయరాం కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా.. “అబ్రహం ఓజ్లర్” నిలిచిపోయింది. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఈ సినిమాను ఖచ్చితంగా చూసి తీరాల్సిందే.
ఇక “అబ్రహం ఓజ్లర్” సినిమా కథ విషయానికొస్తే.. అబ్రహం ఓజ్లర్ అనే వ్యక్తి భార్య పిల్లలు మిస్ అవుతారు. వారు కనిపించకుండా పోయినా కూడా ఓజ్లర్ వారు ఉన్నట్లుగానే భావిస్తాడు. మరో వైపు వరుసగా కొందరు వ్యక్తులు హత్యలకు గురువుతుంటారు. పైగా వాళ్ల దగ్గర హ్యాపీ బర్త్ డే అంటూ రక్తంతో రాసి ఉన్న పేపర్స్ దొరుకుతుంటాయి. అయితే, ఆ హత్యల వెనుక ఉన్న రహస్యాలను ఓజ్లర్ ఛేదించాలనే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో అతను సఫలం అవుతాడా లేదా! అసలు ఓజ్లర్ భార్య పిల్లలు ఏమై ఉంటారు ! ఆ హత్యల వెనుక ఉన్న హంతకుడు ఎవరు ! ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక, ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి. మరి, “అబ్రహం ఓజ్లర్” సినిమాపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.